నాలిక మడతేశారే
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సెపరేటూ. అధినేత చంద్రబాబు కంటే కూడా నాలుగాకులు ఆయన ఎక్కువే చదివారు. అందుకే ఆయనకు తన రాజకీయం గురించి పక్కా [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సెపరేటూ. అధినేత చంద్రబాబు కంటే కూడా నాలుగాకులు ఆయన ఎక్కువే చదివారు. అందుకే ఆయనకు తన రాజకీయం గురించి పక్కా [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సెపరేటూ. అధినేత చంద్రబాబు కంటే కూడా నాలుగాకులు ఆయన ఎక్కువే చదివారు. అందుకే ఆయనకు తన రాజకీయం గురించి పక్కా క్లారిటీ ఉంది. ఎప్పుడేం మాట్లాడాలో కూడా ఆయనకే తెలుసు. విశాఖలో రాజధాని అని మొదట జై కొట్టింది గంటాయే. విశాఖ బెస్ట్ సిటీ. రాజధానికి అనువైనది అంటూ ఆయన చాలానే కబుర్లు చెప్పారు. పార్టీ లైన్ ఎలా ఉన్నా తాను మాత్రం విశాఖ రాజధానికే ఓటు వేస్తామని చెప్పుకొచ్చారు. అంతే కాదు నగర టీడీపీ నాయకులతో కలసి తీర్మానం కూడా ఒకటి చేసి మరీ అధినాయకత్వానికి గంటా శ్రీనివాసరావు పంపారు. అటువంటి గంటా ఇపుడు విశాఖ రాజధాని విషయంలో ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు.
కోర్టులు అడ్డుకుంటాయట….
రాజధానిని తరలిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవని అడ్డుకుని తీరుతాయన్నది గంటా శ్రీనివాసరావు తాజా మాట. పైగా ఇది జరిగే పని కాదని కూడా ఆయన అంటున్నారు. రాజధానిగా అమరావతి ఉందని, అక్కడ రైతులకు మాట ఇచ్చాని కూడా ఆయన అదొక కొత్త విషయంగా చెబుతున్నారు. రాజధాని విషయంలో జగన్ సర్కార్ ఎంత అనుకున్నా ఏమీ చేయలేక చివరికి చేతులెత్తడం ఖాయమని కూడా ఆయన అంటున్నారు. అదే సమయంలో తాను పార్టీ లైన్ కి కట్టుబడి ఉంటానని కూడా చెప్పుకుంటున్నారు. అంటే అమరావతి రాజధాని విషయంలో జై కొడతానని చెప్పడమన్నమాట.
మండలి రద్దు హేయమట….
ఇక శాసనమండలిని రద్దు చేయడం హేయమైన నిర్ణయమని కూడా గంటా శ్రీనివాసరావు అంటున్నారు. జగన్ ఈ విషయంలో పెద్ద తప్పే చేశారని ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మండలి చైర్మన్ని తమ పార్టీ ప్రలోభపెట్టలేదని, అంతా నిబంధలన ప్రకారమే జరిగిందని కూడా గంటా వత్తాసు పలుకుతున్నారు. మొత్తానికి ఏమైందో ఏమో కానీ గంటా శ్రీనివాసరావు పూర్తిగా బాబు మాటలనే బట్టీ పట్టి మరీ చెబుతున్నారు. టీడీపీ నుంచి బయటకు వస్తారని ఇంతకాలం ఆయన పేరు వినిపించేది. ఇపుడు గంటా మాటలను బట్టి చూస్తూంటే సైకిల్ ఇప్పట్లో దిగేలా లేరని అర్ధమవుతోంది. దాంతో మళ్ళీ బాబు భజన మొదలుపెట్టారని అంటున్నారు.
ఉత్తరాధ్ర విలన్లేనా…?
ఇదిలా ఉండగా గంటా శ్రీనివాసరావు లాంటి వారు ఉత్తరాంధ్ర విలన్లు అంటున్నారు వైసీపీ నేతలు, వలస వచ్చిన వీరిని విశాఖ జనం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే మంత్రులుగా అధికారం అనుభవించి చివరికి విశాఖ అభివృధ్ధినే అడ్డుకుంటున్నారని కూడా విమర్శిస్తున్నారు. గంటా విషయానికి వస్తే తన సొంత రాజకీయమే తప్ప విశాఖ కోసం ఆయన పాటుపడింది లేదని కూడా మండిపడుతున్నారు. ఇతర పార్టీలల్లో అవకాశం లేకనే ఆయన చంద్రబాబుని మంచి చేసుకోవడానికి ఆ గూటి పలుకులు పలుకుతున్నారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా గంటాశ్రీనివాసరావులో వచ్చిన తాజా మార్పుని తమ్ముళ్ళు సైతం నమ్మలేకపోతున్నారుట. మరి రాజకీయ గండరగండడు చంద్రబాబు గంటా మాటల మెరమెచ్చులకు ముచ్చట పడి ఆయన్ని తన కోటరీలోకి మళ్ళీ తీసుకుంటారా అన్నడే పెద్ద డౌట్.