ఇంకా ఈయన దిగలేదు.. కారణం ఆయనేనటగా?
ఓ వైపు పల్లే, పట్నం తేడా లేకుండా అంతా ఒక్కటై సందడి చేస్తోంది. ఎన్నికల హడావుడి ఎటు చూసినా కనిపిస్తోంది. మాటల విసుర్లు, విమర్శల జోరు షరా [more]
ఓ వైపు పల్లే, పట్నం తేడా లేకుండా అంతా ఒక్కటై సందడి చేస్తోంది. ఎన్నికల హడావుడి ఎటు చూసినా కనిపిస్తోంది. మాటల విసుర్లు, విమర్శల జోరు షరా [more]
ఓ వైపు పల్లే, పట్నం తేడా లేకుండా అంతా ఒక్కటై సందడి చేస్తోంది. ఎన్నికల హడావుడి ఎటు చూసినా కనిపిస్తోంది. మాటల విసుర్లు, విమర్శల జోరు షరా మామూలుగా సాగిపోతోంది. జగన్ ని నానా మాటలు అంటూ టీడీపీ మాజీలు రెచ్చిపోతున్నారు. ఇవన్నీ విశాఖ జిల్లాలో తాజా సీన్. అయినా కానీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయిపూ అజా లేరు. ఆయన ఇంకా బరిలోకి దిగినట్లుగా లేదు. ఓ వైపు సొంత పార్టీలో ఆయన ప్రత్యర్ధి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ సిటీలో తిరుగుతున్నారు. మేయర్ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ కావాలని అంటున్నారు. మరి తన ఇలాకాలోకి వచ్చి మరీ గర్జిస్తున్నా మాజీ మంత్రిని కట్టడి చేయడానికైనా గంటా శ్రీనివాసరావు ఒక్క మాట కూడా మాట్లాడడంలేదు.
అదేనా కారణం…?
పార్టీ బాధ్యతలు తన నుంచి తప్పిస్తున్నారని గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా మధనపడుతున్నారు. మంత్రులుగా ఉన్నపుడు గంటాకు సిటీ, అయ్యన్నకు రూరల్ బాధ్యతలు చూసుకోమని చంద్రబాబు గిరిగీసి పంపకాలు చేశారు. అయితే పార్టీ ఓడాక గిరిని దాటి అయ్యన్న సిటీలోకి దూసుకువచ్చాడు. నాటి నుంచి అయ్యన్న ఒక లెక్కన దూకుడు చేస్తున్నాడు. ఇది గంటా శ్రీనివాసరావు బ్యాచ్ కి సరిపడడంలేదని అంటున్నారు. తనను బాబు పిలిచి సిటీ బాధ్యతలు చూసుకోమని చెబితే కానీ బరిలోకి దిగకూడదనుకుంటున్నారు. అయితే అయ్యన్నతోనే కధ నడిపించేలా టీడీపీలో సీన్ కనిపిస్తోంది.
మౌనమేనా…?
ఎలాగూ అధికార పార్టీ గట్టిగా ఉంది. పైగా లోకల్ బాడీ ఎన్నికల్లో మేయర్ సహా అన్ని పదవులూ ఇండైరెక్ట్ విధానంలోనే సెలెక్షన్ చేస్తారు. దాంతో బోలేడు తతంగం ఉంటుంది. డబ్బు ఉన్న వారికే మేయర్ సహా పీఠాలు వెళ్ళిపోతాయి. ఈ మాత్రం కధ అర్ధమైన దానికి పోటీ పడి దూకితే ఆ ఓటమితో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకన్న ధోరణిలో కూడా గంటా శ్రీనివాసరావు అనుచరుల్లో ఉందని అంటున్నారు. అయ్యన్న దూకుడు ఏదో ఆయనే చేసుకుంటే రేపటి రోజున వ్యతిరేక ఫలితాలకు కూడా పాపాల భైరవుడిగా కూడా ఆయన్నే నిలబెట్టవచ్చునన్న వ్యూహంతోనే మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.
దెబ్బేనా …?
ఇద్దరు మాజీ మంత్రులు సరిగ్గా లేకపోవడం వల్లనే 2007లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇపుడు ఒకరు సైలెంట్ గా ఉంటే ఇంకా దారుణంగా రిజల్ట్స్ వస్తాయని తమ్ముళ్ళు అంటున్నారు. నిజానికి విశాఖ సిటీలో గంటా శ్రీనివాసరావుకు ఇప్పటికీ బలం బాగా ఉంది. కానీ ఆయన జోక్యం చేసుకుంటారో లేదో తెలియదు. ఎక్కడో రూరల్ ల్లో ఉన్న అయ్యన్న, అదీ కూడా తన సొంత ఇలాకాలో ఓడిపోయిన నేత విశాఖ వచ్చి ఏం చేస్తారని గంటా శ్రీనివాసరావు వర్గీయులు ఎకసెక్కం ఆడుతున్నారట. మొత్తానికి లోకల్ ఫైట్ అయినా మరేదైనా కూడా ఈ ఇద్దరు మాజీల గొడవ ముందు బలాదూర్ అంటున్నారు. అది పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. అసలే విపక్షంలో ఉన్నారు. ఈ సమయంలో ఐక్యంగా ముందుకు సాగాలి. కానీ పసుపు పార్టీలో సీన్ చూస్తే అలా కనిపించడంలేదుగా.