వామ్మో మంత్రి సీటుకే గంటా గురి ?
అందుకే ఆయన్ని రాజకీయ చాణక్యుడు అన్నది. మిగిలిన వాళ్ల మాదిరిగా ఏదో పార్టీలో చేరాం అని సంతృప్తి పడి ఒక మూలన ఉండకుండా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ [more]
అందుకే ఆయన్ని రాజకీయ చాణక్యుడు అన్నది. మిగిలిన వాళ్ల మాదిరిగా ఏదో పార్టీలో చేరాం అని సంతృప్తి పడి ఒక మూలన ఉండకుండా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ [more]
అందుకే ఆయన్ని రాజకీయ చాణక్యుడు అన్నది. మిగిలిన వాళ్ల మాదిరిగా ఏదో పార్టీలో చేరాం అని సంతృప్తి పడి ఒక మూలన ఉండకుండా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కే తయార్ అంటున్నారు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయనకు మంత్రి పదవి కావాలి. అందుకోసం ఆయన పార్టీలు ఎన్ని అయినా మారతారు. అవసరం అయితే ఎన్ని సార్లు జనం నుంచి గెలవమన్నా గెలిచి వస్తారు. ఆయనకు జన బలం ఉంది. అలాగే గుండె ధైర్యం కూడా ఉంది. అంగబలం, అర్ధబలం నిండుగా ఉన్న గంటా శ్రీనివాసరావు విశాఖలో రాజకీయ ఘంటారావం చేస్తున్నారు. ఆయనకు ఎదురునిలిచి పోరులో గెలిచే నేత ఇపుడు ప్రత్యర్ధి వర్గంలో ఉన్నాడా అన్నదే డౌట్.
రాజీ లేదంతే …..
రాజీపడి వైసీపీలో చేరడానికి గంటా శ్రీనివాసరావు మనసు అసలు ఒప్పుకోవడంలేదుట. తాను సీనియర్ మోస్ట్ లీడర్ని అని పైగా మంత్రిగా పనిచేసిన వాడిని అని గంటా అంటున్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు ప్రజాదరణ పుష్కలంగా ఉన్న తాను ఎన్నికల్లో పోటీకి ఎందుకు వెరవాలి అన్నది కూడా ఆయన వైపు నుంచి వస్తున్న వాదనగా ఉంది. జగన్ కనుక వైసీపీలో చేరమంటే కచ్చితంగా టీడీపీకి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే సీటుకు రాజీనామాయే చేసి వస్తానని గంటా శ్రీనివాసరావు చెబుతున్నారని టాక్. తనది రాజమార్గమని, అందుకే తాను దర్జాగానే వైసీపీ అధికార సభ్యుడిని అవుతాను అంటున్నారు.
ఆయనకు రివర్స్ అటాక్……
విశాఖ జిల్లా రాజకీయాల్లో తన హవాకు బ్రేక్ పడుతుందని విజయసాయిరెడ్డి కొంత ఆందోళన పడుతున్న సంగతి విదితమే. ఆయన ఇప్పటిదాకా వైసీపీకీ పెద్ద దిక్కులా ఉంటున్నారు. గంటా శ్రీనివాసరావు లాంటి బిగ్ షాట్ కనుక వైసీపీలో చేరితే సాయిరెడ్డి ప్రభ కొంత మసకబారడం ఖాయం. పైగా ఆయన వర్గం మూడు జిల్లాల్లో గట్టిగా ఉంది. వారంతా వచ్చి చేరితే అసలైన బలం గంటా శ్రీనివాసరావుకే ఉంటుంది. ఈ లెక్కలతోనే సాయిరెడ్డి ఆయనకు బ్రేకు వేస్తున్నారు అని వినిపిస్తోంది. దాంతో సాయిరెడ్డి ఒక మాట అంటున్నారు. వైసీపీలో ఏ ఎమ్మెల్యే అయినా చేరాలంటే తమ పదవికి రాజీనామా చేయాలని కూడా చెబుతున్నారు. దానికి రివర్స్ అటాక్ అన్నట్లుగా గంటా శ్రీనివాసరావు రాజీనామాకు రెడీ అంటున్నారు. టైమ్ డేట్ మీరే ఫిక్స్ చేయండి రాజీనామా లెటర్ తో నేను రెడీ అంటున్నారు. దీంతో ఇపుడు సాయిరెడ్డి కి నో సౌండ్ అన్న మాట కూడా ఉంది.
అదీ స్కెచ్…..
ఇక గంటా శ్రీనివాసరావు వైసీపీలో తన కొడుకుని చేర్చి తాను అనుబంధ సభ్యుడిగా ఉంటే మజా ఏముంటుందని ఆలోచిస్తున్నారు. తాను మళ్లీ గెలిచి వైసీపీ ఎమ్మెల్యే కావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. జగన్ వేవ్ లోనే గెలిచిన తనకు అధికార పార్టీ తరఫున గెలవడం ఏమంత కష్టం కాదని ఆయన నమ్ముతున్నారు. ఇలా గెలిచి వచ్చిన తరువాత మంత్రి పదవికే ఆయన గురి పెడతారు అని కూడా అంటున్నారు. అందుకోసమే ఆయన రాజీనామా ఎత్తు వేస్తున్నారని కూడా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే కధ అటూ ఇటూ తిరిగి అవంతి కుర్చీ కిందకు నీళ్ళు తెచ్చేలా ఉందని అంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు రాజీనామాకు జగన్ ఒప్పుకోవాలి. అదే కనుక జరిగితే తిరుపతి ఉప ఎన్నికతో పాటే విశాఖకు కూడా ఉప ఎన్నిక ఖాయమని అంటున్నారు. చూడాలి మరి.