గంటా.. దర్జా తగ్గలేదుగా
మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పటిమాదిరిగానే నగరంలో కీలకమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలతో గంటా [more]
మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పటిమాదిరిగానే నగరంలో కీలకమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలతో గంటా [more]
మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పటిమాదిరిగానే నగరంలో కీలకమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలతో గంటా శ్రీనివాసరావుకు విషెస్ చెబుతూ ఆయన అనుచరవర్గం బాగానే హడావుడి చేసింది. గంటా నివాసం ఉంటున్న ఎంవీపీ కాలనీ పరిసర ప్రాంతాలతో పాటు, ఉత్తర నియోజక వర్గంలోనూ తమ్ముళ్ళు గంటా శ్రీనివాసరావు జన్మదినాన్ని పండుగలా జరిపారు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న గంటా శ్రీనివాసరావు ప్రతీ ఏటా తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగానే జరుగుతుంటూ వస్తున్నారు. ఆయన ఎక్కువ కాలం అధికార పక్షంలోనే ఉన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఏడేళ్ళ పాటు మంత్రిగా, అయిదేళ్ళ పాటు ఎంపీగా గంటా శ్రీనివాసరావు వ్యవహరించారు. అన్నింటికంటే కూడా ఆయన ఏపీలో బలమైన కాపు నాయకుడిగా తన సత్తా చాటుకుంటున్నారు.
దానికి భిన్నంగా…
గతసారి వరకూ గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో కనిపించే ఫ్లెక్సీల్లో రాతలు వేరేగా ఉండేవి. గంటా మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ప్రతీ ఏటా అభిమానులు, అనుచరులు గట్టిగా కోరుకునేవారు. గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు. అంతకంటే ఉన్నత పదవి అంటే ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ అని కావాలా> అని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు సెటైర్లు వేసేవారు. అయితే అయిదేళ్ళ పాటు చంద్రబాబు ఆయన్ని నమ్మి మంత్రి పదవిని, కీలమైన శాఖను తొలగించలేదు, విశాఖ విషయానికి వస్తే గంటా శ్రీనివాసరావు మాటను సైతం బాబు ఎన్నడూ కాదన్నది లేదు. గత ఏడాది టీడీపీ అనుకూల మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చినపుడు మాత్రం గంటా శ్రీనివాసరావు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దాంతో బాబు స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించారు. ఇక గంటా శ్రీనివాసరావుకు టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉన్నా సరే ఆయన ఆ పార్టీ ఓటమి పాలు అవుతుందని అంచనా వేసుకుని వేరే పార్టీల్లో చేరడానికి చేసిన ప్రయత్నాలు మాత్రం పెద్దగా ఫలించలేదని చెబుతారు.
తేల్చేస్తారా…?
ఇదిలా ఉండగా గంటా శ్రీనివాసరావు ఇప్పటివరకూ తన భవిష్యత్తు రాజకీయ కార్యకలాపాల గురించి ఎక్కడా బయటకు చెప్పడం లేదు, ఆయన నోటి వెంట తాను పార్టీ మారుతున్నానని ఇప్పటివరకైతే ఎక్కడా చెప్పకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. నేను పార్టీ మారాలనుకునటే ముందు మీకే చెబుతాను అంటూ మీడియా రాతలపై గంటా శ్రీనివాసరావు ఒకింత అసహనం వ్యక్తం చేసినా కూడా రూమర్లు మాత్రం ఆగడలేదు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం ఇంకా వేచి చూస్తే ధోరణిలోనే ఉన్నారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకూ చూసుకుని పార్టీ మారాలా లేక సరైన ఆఫర్ ఉంటే ముందే మారాలా అన్న దానిపైన మల్లగుల్లాలు పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక పుట్టిన రోజున గంటా శ్రీనివాసరావుకు అభినందనలు, శుభాకాంక్షలు ఆయన హోదాకు ఏ మాత్రం తగ్గకుండానే వచ్చాయి. ఓ విధంగా ఈ వేడుకను వేదికగా చేసుకుని గంటా వర్గం బలప్రదర్శన చేసిందని చెబుతారు. ఏది ఎలా ఉన్నా గంటా శ్రీనివాసరావుకు అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఆయన ఏపీ రాజకీయాల్లో కీలకమైన నేత అనేందుకు ఆయన పుట్టిన రోజు వేడుకలు ఒక ఉదాహరణ.