గంటా టిట్ ఫర్ టాట్…?
విశాఖ జిల్లా రాజకీయాలు వేడెక్కనున్నాయా. పాలనా రాజధానిలో అగ్గి రాజుకుంటుందా. అంటే జవాబు అవును అనే వస్తోంది. విశాఖ జిల్లా రాజకీయల్లో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న [more]
విశాఖ జిల్లా రాజకీయాలు వేడెక్కనున్నాయా. పాలనా రాజధానిలో అగ్గి రాజుకుంటుందా. అంటే జవాబు అవును అనే వస్తోంది. విశాఖ జిల్లా రాజకీయల్లో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న [more]
విశాఖ జిల్లా రాజకీయాలు వేడెక్కనున్నాయా. పాలనా రాజధానిలో అగ్గి రాజుకుంటుందా. అంటే జవాబు అవును అనే వస్తోంది. విశాఖ జిల్లా రాజకీయల్లో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయంగా ఇపుడు బిగ్ సౌండ్ చేయబోతున్నారా అంటే దానికి కూడా సమాధానం ఎస్ అనే వస్తోంది. గంటా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్న మాట అయితే జిల్లాలో ఉంది. దీనికి గంటా శ్రీనివాసరావు అనుచరులు రగులుతున్నారు. దాంతో తమ నేత గంటా కీలకమైన నిర్ణయం తీసుకోవాలని వారు వత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఓడినవారే ఎక్కువా….?
విశాఖ జిల్లా టీడీపీ రాజకీయం చూసుకుంటే ఓడిన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు సైతం వారికే పెద్ద పీట వేస్తున్నారు అయ్యన్నపాత్రుడే పాతిక వేల ఓట్ల తేడాతో ఓడితే ఆయన కుమారుడిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇక బండారు చుట్టాలే కింజరాపు ఫ్యామిలీ. వారే ఏపీ టీడీపీలో కొత్త సారధులు. అదే సమయంలో బండారు కి కూడా ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలతో గంటా శ్రీనివాసరావు శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది. బాబు కనీసం గంటాకు ఏ ఒక్క పార్టీ పదవి ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన అభిమానులు గుర్రుమంటున్నారు.
తెగిస్తారా….?
రెండు దశాబ్దాలుగా విశాఖ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం నుంచి జగన్ వేవ్ లో సైతం గెలిచి సత్తా చాటారు. ఎంతో మంది ఓడినా కూడా ఆయన తానేంటో చూపించుకున్నారు. అటువంటి గంటా శ్రీనివాసరావుకు కోపం వస్తే ఉత్తర ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. అక్కడ టీడీపీ కధ తేల్చాలంటే కచ్చితంగా గంటా రాజీనామా చేస్తారనే అంటున్నారు. అదే సీటు నుంచి గంటా పోటీ చేసి తాను సొంతంగా గెలవగలను అని నిరూపించుకుంటారని అంటున్నారు. టీడీపీ మళ్ళీ ఆ సీటు దక్కించుకోగలదా అన్నది గంటా శ్రీనివాసరావు వర్గం ప్రశ్నగా ఉందిట.
జగన్ వైపేనా…?
ఇక జగన్ కండిషన్ ప్రకారం చూసినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి రావాలి. గంటా శ్రీనివాసరావు అన్ని లెక్కలూ చూసుకునే ఇపుడు రాజీనామా అంటున్నారా అన్న మాట ఉంది. గంటా కనుక రాజీనామా చేస్తే వైసీపీ నుంచి ఆయనకు టికెట్ దక్కుతుందా అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది. అయితే జగన్ కనుక ఓకే అంటేనే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తారని, అలా కాకుండా ఆయన రాజీనామా చేసినా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించకపోవచ్చునని అంటున్నారు. మొత్తానికి గంటా రాజీనామా చేస్తారన్న ప్రచారం అయితే విశాఖలో జోరుగా సాగుతోంది. నిజంగా అదే జరిగితే మాత్రం విశాఖ రాజకీయం వేడెక్కిపోవడం ఖాయం.