గంటా వెంటపడి వేధిస్తున్నారే ?
రాజకీయాల్లో డిమాండు ఉన్న వారి హవా మామూలుగా ఉండదు. ఇపుడు జనాల కంటే వారిని కదిలించే నాయకుడే ఎక్కువ అయిపోతున్నారు. అందుకే బలమైన నాయకులను చేర్చుకోవడానికి పార్టీలు [more]
రాజకీయాల్లో డిమాండు ఉన్న వారి హవా మామూలుగా ఉండదు. ఇపుడు జనాల కంటే వారిని కదిలించే నాయకుడే ఎక్కువ అయిపోతున్నారు. అందుకే బలమైన నాయకులను చేర్చుకోవడానికి పార్టీలు [more]
రాజకీయాల్లో డిమాండు ఉన్న వారి హవా మామూలుగా ఉండదు. ఇపుడు జనాల కంటే వారిని కదిలించే నాయకుడే ఎక్కువ అయిపోతున్నారు. అందుకే బలమైన నాయకులను చేర్చుకోవడానికి పార్టీలు పోటీ పడుతూంటాయి. విశాఖ వరకూ చూసుకుంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ జంక్షన్ లో ఉన్నారు. ఆయన టీడీపీని దాదాపుగా వీడినట్లే లెక్క అంటున్నారు. ఆయన చంద్రబాబు తో కూడా ఈ మధ్య సన్నిహితంగా ఉంటున్నట్లుగా ఎక్కడా కనిపించడంలేదు. టీడీపీ ఆఫీస్ గడప తొక్కకుండా అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్ళకుండా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే గిరినీ అలా కొనసాగిస్తున్నారు.
వైసీపీ మీద అలా…..
గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే మొదట్లో జగన్ ఓకే చేసినా ఆ తరువాత విశాఖ వైసీపీ నేతల అభ్యంతరాలు, గంటా అనుచరుల భూ కబ్జాల కధలతో వెనక్కి తగ్గారని అంటారు. ఇక గంటా కూడా వైసీపీలోకి వెళ్ళేందుకు తుది విడత ప్రయత్నాలు చేస్తున్నాట్లుగా తాజా టాక్. తన వంతుగా ఆయన వైసీపీ వైపు నుంచి పిలుపు వచ్చేలా చేసుకుంటున్నారు అంటున్నారు. ఒక వేళ అది కుదరకపోతే అపుడు బోల్డ్ డెసిషన్ తీసుకుంటారు అంటున్నారు.
బీజేపీ ఆఫర్లు…..
గంటా శ్రీనివాసరావుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే సామాజికవర్గం నేతలు కావడమే కాదు, ఇద్దరికీ మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఈ ఇద్దరు నేతలూ మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకుంటారన్నది తెలిసిందే. గంటా శ్రీనివాసరావును ఎలాగైనా బీజేపీలోకి తెచ్చి ఉత్తరాంధ్రా బాధ్యతలు ఆయన చేతిలో పెట్టాలని సోము భావిస్తున్నారుట. గంటాకు ఉన్న బలం, బలగం కనుక బీజేపీలో చేరితే ఇక మూడు జిల్లాల్లో చూసుకోనవసరం లేదని సోము వీర్రాజు దృఢమైన అభిప్రాయం.
తేల్చేస్తారా…?
గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వస్తే ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని హామీలు కూడా వస్తున్నాయట. కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ని కూడా గంటాకు చేస్తున్నట్లు భోగట్టా. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన గంటా ఓటమెరుగని నేతగా పేరు పొందారు. దాంతో ఆయన కనుక వస్తే కాంగ్రెస్, టీడీపీలలో ఆయనతో ఉన్న సన్నిహితులు కూడా కాషాయం కడతారు అని అంటున్నారు. మొత్తానికి గంటా బీజేపీకి నో చెప్పకపోవడం ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. గంటాను వైసీపీలోకి తీసుకురావాలని ఉత్తరాంధ్రాకు చెందిన ఓ సీనియర్ మంత్రి గట్టిగా ప్రయత్నాలు చేస్తూండడంతో గంటా బీజేపీని ఆగమంటున్నట్లుగా చెబుతున్నారు. మరి ఆ మంత్రి మాటకు జగన్ విలువ ఇస్తే గంటా వైసీపీలోకి వస్తారు. లేకపోతే మాత్రం జై బీజేపీ, జై మోడీ అనేస్తారని లేటెస్ట్ టాక్.