ఉక్కు లెక్కలతో ఫ్యాన్ రెక్కలు తిప్పేయాలనే…?
ఊరకే రారు మహానుభావులు అని ఒక పాత సామెతగా అంటారు. కానీ రాజకీయాల్లో చూసుకుంటే ఎవరైనా ఏదైనా పావు కదిపారు అంటే ఆట ఎక్కడో సాగాలన్న మాటే. [more]
ఊరకే రారు మహానుభావులు అని ఒక పాత సామెతగా అంటారు. కానీ రాజకీయాల్లో చూసుకుంటే ఎవరైనా ఏదైనా పావు కదిపారు అంటే ఆట ఎక్కడో సాగాలన్న మాటే. [more]
ఊరకే రారు మహానుభావులు అని ఒక పాత సామెతగా అంటారు. కానీ రాజకీయాల్లో చూసుకుంటే ఎవరైనా ఏదైనా పావు కదిపారు అంటే ఆట ఎక్కడో సాగాలన్న మాటే. ఆ కదలికల వెనక ఎన్నో కధలు కూడా ఉంటాయి. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ విధంగా ఆయన టీడీపీతో పురుడు బంధం తెంచుకున్నారు. ఇక ఇపుడు ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అన్నదే చర్చ.
జగన్ ఈజ్ గ్రేట్ ….
రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు ఇపుడు స్వేచ్చా జీవి అన్న మాటే. అందుకే ఆయన ముఖ్యమంత్రి జగన్ ని తెగ పొగుడుతున్నారు. మోడీకి జగన్ రాసిన లేఖలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వేరే అర్ధాలు, స్వార్ధాలు కనిపిస్తే గంటాకు మాత్రం అందులో ఎన్నో పరమార్ధాలు కనిపించాయి. జగన్ ఎన్నో విలువైన సూచనలు ప్రధాని మోడీకీ ఇచ్చారని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా చెప్పేశారు. మొత్తానికి సోపు బాగానే వేస్తున్నారు అన్న మాట అయితే విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
అది కీలకమే ….
ఇక విశాఖ అంటే జగన్ కి ఎంత ప్రేమ ఉందో తెలిసిందే. దాంతో పాటే జీవీఎంసీ ఎన్నికలు ముంగిట్లో పొంచి ఉన్నాయి. ఈ టైంలో కనుక వైసీపీ జనాల్లో బ్యాడ్ అయితే మేయర్ సీటు గోవిందా అన్న మాటే. ఇపుడు గంటా శ్రీనివాసరావు ఉక్కు పరిశ్రమ ఉద్ధరణ పేరిట రంగంలోకి దిగారు. ఆయన నాన్ పొలిటికల్ జేఏసీ కూడా ఏర్పాటు చేయనున్నారు. మరి ఈ కీలకమైన వేళ గంటా వైసీపీకి స్నేహ హస్తం అందిస్తున్నారు. ఇపుడు వైసీపీకి కూడా రాజకీయ అవసరం ఉంది. గంటా శ్రీనివాసరావును కాదంటే జీవీఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ రివర్స్ గేర్ వేయడం ఖాయం. పైగా అన్ని రకాలుగా బలమున్న గంటా శ్రీనివాసరావును వద్దనుకుంటే ముప్పే కూడా.
ఓకే అనేస్తారా….?
ఇన్నాళ్ళూ వేరు, ఇపుడు రాజకీయం వేరు. విశాఖ బరిలో వైసీపీకి ఫేస్ వాల్యూ ఉన్న నేతలు బహు తక్కువ. ఇక గంటా శ్రీనివాసరావు లాంటి బిగ్ పొలిటికల్ ఫిగర్ ని తమ వైపు ఉంచుకుంటే విజయం ఖాయమన్న ఆలోచన వైసీపీ పెద్దలకు కలగాలే కానీ ఆయన ఫ్యాన్ నీడకు ఏ క్షణమైనా చేరడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి చూస్తే గంటా శ్రీనివాసరావు సరైన టైంలోనే తన మాస్టర్ పాలిటిక్స్ కి తెర తీశారు అంటున్నారు. హిట్ అయితే కనుక అటు గంటా శ్రీనివాసరావుకు, ఇటు వైసీపీకి లాభమే.