గంటా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేశారు. అంతే కాకుండా గంటా శ్రీనివాసరావు [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేశారు. అంతే కాకుండా గంటా శ్రీనివాసరావు [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేశారు. అంతే కాకుండా గంటా శ్రీనివాసరావు ఇతర పార్టీల నేతలను కూడా ఉద్యమంలోకి కలసి రావాలని కోరుతుండటం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారనే అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ ఇరుకున పడే విధంగా గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు.
కీలకంగా మారిన గంటా….
విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వెనకడుగు వేసేది లేదని పదే పదే చెబుతోంది. దీంతో ఉద్యమం ఊపందుకుంది. నెల రోజుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు బీజేపీ, జనసేన పార్టీలు మినహాయించి అన్ని పార్టీలూ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే ఈ ఉద్యమంలో గంటా శ్రీనివాసరావు కీలకంగా మారారు.
గంటా బాటలోనే…..
తమ సమస్యపై తక్షణం స్పందించిన నేత గంటా శ్రీనివాసరావు మాత్రమేనని స్టీల్ ప్లాంట్ కార్మికులు సయితం విశ్వసిస్తున్నారు. అందరూ ఆయన బాటలో పయనిస్తే ప్రయివేటీకరణ నిలిచిపోతుందని చెబుతున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం ఉద్యమంలోకి పవన్ కల్యాణ్ దిగాల్సిందేనంటున్నారు. అవసరమైతే బీజేపీతో కటీఫ్ చెప్పి ఉద్యమంలోకి వస్తే పవన్ కల్యాణ్ కు మంచి భవిష్యత్ ఉంటుందని గంటా శ్రీనివాసరావు పదే పదే సూచిస్తున్నారు.
పదే.. పదే రమ్మంటూ….
పవన్ కల్యాణ్ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఢిల్లీ వెళ్లి వచ్చారు. అంతే తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై పెద్దగా స్పందించింది లేదు. అయినా గంటా శ్రీనివాసరావు పవన్ కల్యాణ్ ను పదేపదే పిలుస్తున్నారు. ఉద్యమంలోకి రావడానికి అభ్యంతరమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా షూటింగ్ ల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ను గంటా శ్రీనివాసరావు ఇరికించే ప్రయతనం చేస్తున్నారన్న కామెంట్స్ జనసైనికుల నుంచి విన్పిస్తున్నాయి. మొత్తం మీద పవన్ ను గంటా అలా ఇరుకున పెడుతున్నారన్నది సస్పెన్స్.