గంటా కు షాకిస్తారా? రాజీనామాను ఆమోదిస్తారా?
ఏపీలో మరో ఉప ఎన్నిక ఖాయమా? గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందుతుందా? రాజీనామా ఆమోదం పొందితే ఉప ఎన్నిక ఖాయమే. మరి వైసీపీ ఆలోచన ఎలా [more]
ఏపీలో మరో ఉప ఎన్నిక ఖాయమా? గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందుతుందా? రాజీనామా ఆమోదం పొందితే ఉప ఎన్నిక ఖాయమే. మరి వైసీపీ ఆలోచన ఎలా [more]
ఏపీలో మరో ఉప ఎన్నిక ఖాయమా? గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందుతుందా? రాజీనామా ఆమోదం పొందితే ఉప ఎన్నిక ఖాయమే. మరి వైసీపీ ఆలోచన ఎలా ఉంది? గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టేందుకు రాజీనామాను ఆమోదిస్తారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే ఆయన రాజీనామా లేఖను పంపారు.
నెలరోజులు దాటుతున్నా….
గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి నెలరోజులు గడుస్తున్నా దీనిపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదు. గంటా మాత్రం తన రాజీనామాను ఆమోదించుకుని తీరతామని చెబుతున్నారు. తాను మరోసారి పోటీ చేయనని కూడా గంటా శ్రీనివాసరావు చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తన రాజీనామాను ఆమోదింప చేసుకుంటానని గంటా శ్రీనివాసరావు పదే పదే చెబుతున్నారు.
ఉక్కు ఉద్యమాన్ని…..
ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ప్రభుత్వం కూడా గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడానికే సిద్ధంగా ఉందని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు ఇప్పటికే విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారితో భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కూడా గంటా శ్రీనివాసరావు కలసి వచ్చారు. ఇది వైసీపీ నేతలకు మంటగా ఉంది.
ఉప ఎన్నిక వచ్చినా…..
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తానే త్యాగం చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు బిల్డప్ ఇస్తున్నారని వైసీీపీ ఎంపీ విజయసాయరెడ్డి ఆరోపిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని టీడీపీకి అనుకూలంగా మారుస్తున్నారన్న అనుమానం కూడా వైసీపీలో ఉంది. గంటా శ్రీనివాసరావు ఎటూ తాను పోటీ చేయనని చెప్పారు కాబట్టి ఆయన రాజీనామాను ఆమోదిస్తేనే బెటర్ అన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక వస్తే అప్పుడు చూసుకోవచ్చులే అన్న ధోరణి వైసీపీలో కన్పిస్తుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక డివిజన్లు కైవసం చేసుకోడం కూడా ఒక కారణమంటున్నారు.