గంటా రాజకీయమే కాదు… ఇప్పుడు సీటు కూడా ?
ప్రతీ ఎన్నికకూ ఒక నియోజకవర్గాన్ని మారుస్తారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పేరుంది. అలా ఆయన ఇప్పటికి నాలుగు నియోజకవర్గాలు మార్చారు. చిత్రమేంటి అంటే పోటీ [more]
ప్రతీ ఎన్నికకూ ఒక నియోజకవర్గాన్ని మారుస్తారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పేరుంది. అలా ఆయన ఇప్పటికి నాలుగు నియోజకవర్గాలు మార్చారు. చిత్రమేంటి అంటే పోటీ [more]
ప్రతీ ఎన్నికకూ ఒక నియోజకవర్గాన్ని మారుస్తారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పేరుంది. అలా ఆయన ఇప్పటికి నాలుగు నియోజకవర్గాలు మార్చారు. చిత్రమేంటి అంటే పోటీ చేసిన ప్రతీ చోటా గెలిచారు. ఇపుడు ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తారన్న వార్తల నేపధ్యంలో దానికి నిరసనగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అది స్పీకర్ తమ్మినేని సీతారామ్ వద్ద పెండింగులో ఉంది. తన రాజీనామా ఆమోదం పొందితే మళ్ళీ పోటీ చేయను అని కూడా గంటా శ్రీనివాసరావు చెప్పేశారు. అలా వచ్చే ఎన్నికలలోనే ఆయన తిరిగి పోటీ చేస్తారని అనుచరులు చెబుతున్నారు.
హాట్ ఫేవరేట్ గా …?
అయితే గంటా శ్రీనివాసరావు మనసు అంతా తనకు అచ్చి వచ్చిన భీమిలీ మీదనే ఉందిట. ఆయన 2019 ఎన్నికల్లో కూడా మరో మారు భీమిలీ నుంచి పోటీ చేయాలని గట్టిగా భావించారు. ఈ గొడవల వల్లనే అవంతి శ్రీనివాసరావు టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరిపోయారు. ఇక లోకేష్ పేరు చెప్పి గంటాను భీమిలీ గడప దాటించిన టీడీపీ హై కమాండ్ చివరికి ఉత్తరం సీటును ఆనాడు కన్ ఫర్మ్ చేసింది. అయిష్టంగా అక్కడ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఇపుడు ఆ ఎమ్మెల్యే పదవినీ వద్దనుకున్నారు. దాంతో ఆయన మళ్ళీ భీమిలీ నుంచి పోటీ చేస్తారు అన్న ప్రచారం ఒక వైపు జరుగుతున్న వేళ హఠాత్తుగా భీమిలీకి ఒక ఇంచార్జిని టీడీపీ హై కమాండ్ నియమించింది.
ఆయన ఊసెత్తలేదే …?
భీమిలీ కొత్త ఇంచార్జి కోరాడ రాజబాబు తనకు ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు కానీ గంటా శ్రీనివాసరావు పేరుని మాత్రం ఎక్కడా తలవలేదు. దాంతో గంటా శ్రీనివాసరావును దూరం పెట్టడానికే ఈయనకు పదవి ఇచ్చారా అన్న చర్చ వస్తోంది. అదే సమయంలో గంటా శ్రీనివాసరావు పార్టీలో ఉన్నాట్లా లేనట్లా అన్న మాట కూడా వస్తోంది. గంటా సైలెంట్ గా ఉండడంతో పాటు ఏ విషయంలోనూ అసలు నో రియాక్షన్ అన్నట్లుగా ఉంటున్నారు. దాంతో ఆయనను టీడీపీ రాజకీయాలకు దూరంగా పెట్టారని టాక్ ఉంది.
అందుకే అలా ….
మరో వైపు చూస్తే కోరాడ రాజబాబుని వచ్చే మూడేళ్ళూ పార్టీని నడిపించడానికి ఉపయోగించు కుంటారని అంటున్నారు. లోకేష్ కి భీమిలీ నుంచి పోటీ చేయాలని ఉందని, అందువల్ల చివరి నిముషంలో ఆయన పోటీకి దిగితే అడ్డు ఎవరూ ఉండకుండానే ద్వితీయ శ్రేణి నేతగా ఉన్న కోరాడ రాజబాబుతో ఈ ఖాళీని భర్తీ చేశారు అంటున్నారు. ఈ విధంగా గంటా శ్రీనివాసరావుకు నో చాన్స్ అని కూడా చెప్పేశారు అని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు మళ్ళీ ఉత్తరం నుంచి పోటీ చేయాలనుకోవడంలేదు అన్నది స్పష్టం. ఇపుడు భీమిలీ సీటు కూడా లేకుండా పోతే ఆయన ఎక్కడ నుంచి బరిలోకి దిగితారు అన్నది మాత్రం ఆసక్తికరమైన చర్చగానే ఉంది. మొత్తానికి గంటా రాజకీయమే కాదు సీటు కూడా ఇపుడు డౌట్లో పడింది అంటున్నారు.