వావ్.. గోవా… రికార్డ్ బ్రేక్ చేశావుగా?
అత్యధికంగా పర్యాటకులు ఉండే ప్రాంతం గోవా. ఇక్కడికి విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తుంటారు. అలాంటి గోవా గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి [more]
అత్యధికంగా పర్యాటకులు ఉండే ప్రాంతం గోవా. ఇక్కడికి విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తుంటారు. అలాంటి గోవా గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి [more]
అత్యధికంగా పర్యాటకులు ఉండే ప్రాంతం గోవా. ఇక్కడికి విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తుంటారు. అలాంటి గోవా గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. కరోనా మహ్మమ్మారి ప్రపంచమంతా విలయతాండవం చేస్తుంది. ప్రాంతాలకు అతీతంగా వ్యాపిస్తోంది. అయితే గోవాలో కరోనా మొదలయిన నాటి నుంచి కేవలం ఏడుగురికి మాత్రమే ఈ వ్యాధి సోకింది. వారందరూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఆఖరి కేసు ఈనెల 3న…
గోవాలో ఆఖరి కేసు ఈ నెల 3వ తేదీన వచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. గత పక్షం రోజుల నుంచి మరెవ్వరికీ కరోనా సోకలేదు. దీంతో గోవా కూడా దేశంలో కరోనా రహిత రాష్ట్రంగా పేరొందింది. కరోనా వ్యాధి ప్రబలుతుందని తెలియగానే గోవా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయింది. విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే గోవాలో కరోనా వ్యాప్తి చెందుతుందన్న అంచనా వేసిన ప్రభుత్వం తక్షణం చర్యలకు దిగింది.
ప్రభుత్వం వెంటనే…..
తొలుత విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్ట్ లను ఏర్పాటు చేసింది. ఎవరు వచ్చినా పరీక్షలు చేసి అనుమతించడం మార్చి చివరి నుంచే ప్రారంభించింది. దీంతో గోవాలో కరోనా కట్టడి సాధ్యమయిందంటున్నారు. మార్చి 25వ తేదీన గోవాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది. మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నా, గోవాలో మాత్రం ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
22 నుంచే సరిహద్దులు మూసేసి…..
గోవాలో లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేశారు. దీనికి స్థానికుల నుంచి సహకారం ప్రభుత్వానికి పూర్తిగా లభించింది. నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూ విధించిన నాటి నుంచే గోవా అన్ని సరిహద్దులనూ మూసివేయడంతో కరోనా ఇబ్బంది నుంచి తప్పించుకుంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి ఒక్క వాహనాన్ని కూడా గోవా ప్రభుత్వం అనుమతించలేదు. మొత్తం మీద ప్రజల సహకారం, ప్రభుత్వ చర్యలు గోవాలో కరోనా కట్టడికి కారణమయ్యాయని చెప్పక తప్పదు.
- Tags
- goa
- à°à±à°µà°¾