చెమటలు పడుతున్నాయా…?
నాలుగేళ్లక్రితం జరిగిన గోదావరి పుష్కర తొక్కిసలాట ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా ఉందా. ఖచ్చితంగా అవుననే అంటున్నాయి వైసిపి వర్గాలు. పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ కోసం 28 [more]
నాలుగేళ్లక్రితం జరిగిన గోదావరి పుష్కర తొక్కిసలాట ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా ఉందా. ఖచ్చితంగా అవుననే అంటున్నాయి వైసిపి వర్గాలు. పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ కోసం 28 [more]
నాలుగేళ్లక్రితం జరిగిన గోదావరి పుష్కర తొక్కిసలాట ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా ఉందా. ఖచ్చితంగా అవుననే అంటున్నాయి వైసిపి వర్గాలు. పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ కోసం 28 మంది అమాయక భక్తులు అసువులు భాస్తే ఒక్క చర్య లేకపోవడం తీవ్ర విమర్శలకు జాతీయ స్థాయిలో దారితీసింది. దీనిపై జస్టిస్ సోమయాజులతో ఏక సభ్య కమిషన్ నియమించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది చంద్రబాబు సర్కార్. కమిషన్ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు కూడా అయిపొయింది. జాగ్రత్తగా పుష్కర పాపం నుంచి గట్టెక్కేశామని అప్పుడు అనుకున్నా వైసిపి ప్రభుత్వం చంద్రబాబు చేసిన తప్పుల చిట్టా తవ్వి తీసి చర్యలకు సిద్ధం కావడం టిడిపి లో గుబులు రేకెత్తిస్తుంది.
అందరికి తెలిసినా …
గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులు ఎవరు ఎందుకిలా జరిగిందో అందరికి తెలిసిందే. విఐపి లకోసం ప్రత్యేక ఘాటు ను ఏర్పాటు చేసినా చంద్రబాబు అత్యంత రద్దీగా వుండే పుష్కర ఘాట్ ను పవిత్ర స్నానం చేసేందుకు విచ్చేశారు. దీనికి ప్రధాన కారణం పుష్కర ఈవెంట్ ను అంతర్జాతీయ స్థాయిలో హైలెట్ చేసేందుకు నేషనల్ జియో గ్రాఫిక్ ఛానెల్ తో, అలాగే ప్రముఖ సినీదర్శకుడు బోయపాటి శ్రీను ల సారధ్యంలో డీల్ కుదిరింది. దాని ప్రకారం లక్షలాది మంది కిక్కిరిసి వుండే దృశ్యాలు రికార్డ్ కావాలి. దీనికోసం తెల్లవారు జామునుంచి వచ్చిన భక్తులను ఘాట్ లోకి అనుమతించకుండా వేరే ఘాట్ లకు సైతం డైవర్ట్ చేయకుండా ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశాల నేపథ్యంలో ఘటనల తరబడి క్యూలైన్లలో వున్న భక్తులను చంద్రబాబు వచ్చిన సమయంలో ఒక్కసారిగా గేట్లు తీసి వదలడంతో భారీ తొక్కిసలాట జరిగి అమాయక భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
నివేదిక కూడా గోదావరిలో …..
దీనిపై జస్టిస్ సోమయాజులు కమిషన్ సుదీర్ఘ కాలమే విచారణ జరిపింది. మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్, ఎపి బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు, జక్కంపూడి విజయలక్ష్మి ప్రజాసంఘాలు విచారణకు హాజరై అన్ని వివరాలను కమిషన్ ముందు అందించాయి. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాదులు మద్దూరి సుబ్బారావు సహకారం అందిస్తే చిత్తపెంట ప్రభాకర్ వాదనలు అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత జస్టిస్ సోమయాజులు దీనిపై పలు సూచనలు చేస్తూ కేసు విచారణ నివేదికను చంద్రబాబు ప్రభుత్వానికి అందించారు. అయితే ప్రభుత్వ తప్పులపై చర్యలు చేపట్టే ఉద్దేశ్యం లేకపోవడంతో ఈ నివేదికను బుట్టదాఖలు చేసి చేతులు దులిపేశారు.
సిసి ఫుటేజ్ మాయం చేశారు …
లక్షలాదిమంది భక్తులు వచ్చే పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఘాట్ లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా వచ్చే వీడియో లను రాజమండ్రి త్రి టౌన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ లో పర్యవేక్షించేవారు. పుష్కర తొక్కిసలాట సంఘటన జరిగిన ఘాట్ లో ఏమి జరిగిందో తెలియకుండా సిసి టివి ఫుటేజ్ ను పోలీసులు మాయం చేశారు. దీనిపై జస్టిస్ సోమయాజులు సైతం పోలీసులకు అక్షింతలు వేశారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్ప లు కమాండ్ కంట్రోల్ కి వెళ్లి ఈ వీడియో లు తిలకించి ఎలా జరిగిందో వీక్షించారు. అలాంటిది విచారణలో అత్యంత కీలకమైన సాక్ష్యాలు అయిన వీటిని ఎవరి ఆదేశాల మేరకు మాయం చేశారన్న అంశం ఇప్పుడు వైసిపి సర్కార్ ఏర్పాటు చేయనున్న విచారణలో బయటపడనుంది. నాటి వీడియోల్లో బోయపాటి శ్రీను పర్యవేక్షణ, నేషనల్ జియో గ్రాఫిక్ ఛానెల్ కెమెరామెన్లు హేవలాక్ వంతెనపైన మరికొన్ని ప్రాంతాల్లో భారీ కెమెరా సెట్ అప్ తో షూట్ చేస్తున్న విజువల్స్ జాతీయ ఛానెల్స్ లో ప్రసారం అయ్యాయి. ఇవన్నీ ఇప్పుడు మరోసారి విచారణలో బయటపడనున్నాయి.
గంటలో పోస్టుమార్టం పూర్తి ….
జాతీయ స్థాయిలో అప్రదిష్ట మూటగట్టుకున్న పుష్కర తొక్కిసలాట సంఘటనలో మృతులకు పోస్టుమార్టం రికార్డ్ స్థాయిలో జరిగింది. గంటలోనే అన్ని పూర్తి అయిపోయినట్లు ప్రకటించి మృతదేహాలను హడావిడిగా తరలించేశారు. విపక్షాలు ఆసుపత్రి చేరే సమయానికే శవాలను వారి కుటుంబ సభ్యుల ఇళ్ళకు యుద్ధప్రాతిపదికన తరలించేశారు. నష్టపరిహారం కూడా అత్యంత వేగంగా చంద్రబాబు ప్రభుత్వం సెటిల్ చేసింది పుష్కర తొక్కిసలాట కేసులోనే కావడం గమనార్హం. పుష్కర తొక్కిసలాట తో ఒక పక్క పెను విషాదం చోటు చేసుకుంది. మరో పక్క ఇలాంటి సందర్భంలో పుష్కరాలు కుంభమేళా తరహాలో విజయవంతం అయ్యాయి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి భారీ సభను రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అందులో అంతా బాగా పని చేశారంటూ అవార్డు లు రివార్డ్ లు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఒక్కరిపై చర్య ఎందుకు లేదు …?
ఏ చిన్న సంఘటన జరిగినా దానిపై చర్య తీసుకోవడం దోషులను శిక్షించడం లేదా అలాంటి తప్పులు తిరిగి పునరావృతం కాకుండా భవిష్యత్తులో చేపట్టాలిసిన అంశాలు పరిగణలోకి తీసుకుంటాయి ప్రభుత్వాలు. అయితే 28 మంది ప్రాణాలు గాల్లో కలిసి పోవడం వందలాదిమంది గాయపడిన సంఘటనలో ఒక్కరంటే ఒక్కరిపై చర్య ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు చంద్రబాబు సర్కార్ దగ్గర జవాబు లేకపోవడం బాధ్యతారహితం అన్నది అందరికి తేటతెల్లం అయ్యింది. ముఖ్యమంత్రి బాధ్యుడిగా జరిగిన సంఘటన కావడంతో నిజాలు బయటపడితే ముప్పే అని భావించే అంతా గప్ చుప్ అయిపోయినట్లు తేలిపోయింది. అయితే నాటి కలెక్టర్ అరుణ కుమార్ మాత్రం కేంద్రానికి పంపిన నివేదికలో నిజాలు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. చేసిన పాపం ఎప్పటికైనా వెంటాడుతుందన్న కర్మ సిద్ధాంతం ప్రకారం చంద్రబాబు దోషిగా నిలబడే పుష్కర తొక్కిసలాటను ఎట్టి పరిస్థితుల్లో వైసిపి వదిలే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే నాటి సంఘటనపై పునర్విచారణ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు గమనిస్తే జగన్ టిడిపి అధినేత చంద్రబాబుకు చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తుంది.