మంత్రి పదవే టార్గెట్… వైసీపీ ఎమ్మెల్యే స్కెచ్
ఏ నాయకుడికైనా లక్ష్యం ఉంటే.. ఇక, అక్కడి నుంచి అన్ని పనులు జరిగిపోతాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ను [more]
ఏ నాయకుడికైనా లక్ష్యం ఉంటే.. ఇక, అక్కడి నుంచి అన్ని పనులు జరిగిపోతాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ను [more]
ఏ నాయకుడికైనా లక్ష్యం ఉంటే.. ఇక, అక్కడి నుంచి అన్ని పనులు జరిగిపోతాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ను నడిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. విశాఖ జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం అయిన పాయకరావుపేట టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఆరు సార్లు విజయం సాధించింది. గతంలో ఒకసారి వరుసగా మూడు సార్లు గెలుపు గుర్రం ఎక్కింది. తర్వాత వరుసగా రెండు సార్లు పట్టు నిలుపుకొంది. నాయకులు ఎవరైనా కూడా పార్టీ గెలుపు ఖాయమైన నియోజకవర్గాల్లో టీడీపీకి కలిసి వచ్చిన నియోజకవర్గం ఇదే.
ఒక వర్గానికి మాత్రమే….
ఈ క్రమంలోనే 2014లో వంగలపూడి అనిత ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే, ఆమె ఓ వర్గాని కి మాత్రమే పరిమితం కావడం, కేవలం విజిటింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరించడంతో ప్రజలకు దూరమయ్యారు. ఇది ఎన్నికల వరకు కొనసాగడం, ఆమె దృష్టి అంతా కూడా మంత్రి పదవిపై ఉండడం, స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడంతోనే ఐదేళ్ల పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఈ క్రమంలోనే ఈ యేడాది ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇస్తే సహించమని స్థానిక కేడర్ రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేసి సక్సెస్ అయ్యారు.
బాబూరావు మాత్రం….
ఇక పాయకరావుపేటలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అభ్యర్థిని మార్చినప్పటికీ.. టీడీపీని ప్రజలు ఆదరించ లేదు. ఇక, గతంలో కాంగ్రెస్ తరఫున ఒకసారి గెలిచి తన సత్తాను నిరూపించుకున్న గొల్ల బాబూరావుకు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీ టికెట్‌పై విజయం అందించారు. 2012 ఉప ఎన్నికల్లోనూ ఆయన వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే, ఇప్పుడు బాబూరావు దృష్టి కూడా మంత్రి పదవిపైనే ఉందని తెలుస్తోంది. దూకుడు తత్వంతో పాటు ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటారనే పేరు తెచ్చుకున్న గొల్ల బాబూరావు.. జగన్ కేబినెట్లో మంత్రి పదవిపై కన్నేశారు.
అభివృద్ధికి మాస్టర్ ప్లాన్….
ఈ క్రమంలోనే జగన్ దృష్టిలో పడేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఏడు నెలల్లో చాలా ఎస్సీ నియోజకవర్గాలకు రాని నిధులు పాయకరావుపేటకు వచ్చాయి. బాబూరావు నియోజకవర్గం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేస్తున్నారు. అదే సమయంలో ఎస్సీ నియోజకవర్గం సబ్ ప్లాన్ నిధులతో పనులు చేపడుతున్నారు. మొత్తంగా చూస్తే.. గతంలో అనిత కన్నా.. కూడా ప్రస్తుత ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉన్నారనే వ్యాఖ్యలు ప్రజల నుంచే వినిపిస్తుండడం గమనార్హం.
సన్నిహితుడిగా పేరు….
ఇక గతంలో వైఎస్ నుంచి ఆ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడు అయిన బాబూరావు 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించి.. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో జగన్ కోరిక మేరకు అమలాపురంలో పోటీ చేసి ఓడిపోయినా.. ఈ ఏడాది ఎన్నికల్లో మళ్లీ పాయకరావుపేటలో గెలిచారు. ఎస్సీల్లో సీనియర్ కావడంతో పాటు జగన్ ఫ్యామిలీకి వీర విధేయుడు కావడంతో ఎస్సీ కోటాలకు ఆయన మంత్రి పదవే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు టాక్.. మరి ఆయన ఆశలు జగన్ ఎంత వరకు నెరవేరుస్తాడో ? చూడాలి.