ఆ ఫార్ములా తోనే వెళతారా ?
త్వరలో నగారా మ్రోగనున్న రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు టిడిపి ఇప్పటి నుంచి కసరత్తు ముమ్మరం చేసింది. ఎపి అంతా జగన్ ఫోబియా లో ఉండటంతో ఎలాగైనా నాలుగోసారి [more]
త్వరలో నగారా మ్రోగనున్న రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు టిడిపి ఇప్పటి నుంచి కసరత్తు ముమ్మరం చేసింది. ఎపి అంతా జగన్ ఫోబియా లో ఉండటంతో ఎలాగైనా నాలుగోసారి [more]
త్వరలో నగారా మ్రోగనున్న రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు టిడిపి ఇప్పటి నుంచి కసరత్తు ముమ్మరం చేసింది. ఎపి అంతా జగన్ ఫోబియా లో ఉండటంతో ఎలాగైనా నాలుగోసారి రాజమండ్రి కార్పొరేషన్ గెలిచి తమ సత్తా చాటాలని సైకిల్ పార్టీ తహతహ. మూడు సార్లు రాజమండ్రి కార్పొరేషన్ ను వరుసగా గెలిచిన టిడిపి గత ఫార్ములా తో ముందుకు వెళుతుందా లేక కొత్త వ్యూహంతో బరిలోకి దిగనుందా అన్న చర్చ జోరుగా నడుస్తుంది. ఈ మూడు సార్లు ఎన్నికలకు ప్రస్తుత రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సారథ్యంలోనే నడిచాయి. ఆయన టిక్ పెట్టిన వారికే టిక్కెట్లు దక్కాయి. మేయర్ అభ్యర్థులను గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైనల్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఆయన మార్క్ లేకుండా ఎన్నికలకు టిడిపి బరిలోకి దిగనుందని అంటున్నాయి పార్టీ వర్గాలు. అర్బన్ నుంచి రూరల్ కి గోరంట్ల మారడంతో ఆయనకు సహజంగానే నగరంలో పట్టు సడలింది. అయినప్పటికీ రూరల్ లో కొన్ని డివిజన్లు కార్పొరేషన్ లో ఉన్నప్పటికి గతంలోని ఆధిపత్యం రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఉండదు.
ఆదిరెడ్డి కుటుంబమే డిసైడ్ చేస్తుంది …
ప్రస్తుత ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబమే అన్ని తామే అయ్యి కార్పొరేషన్ ఎన్నికలకు నడుం బిగిస్తుంది. జగన్ సునామీ లో భారీ మెజారిటీ తో టిడిపి నుంచి భవాని గెలిచారు. దాంతో అధిష్టానం సైతం ఆదిరెడ్డి కుటుంబాన్ని కాదని నిర్ణయాలు తీసుకోవడానికి సాహసం చేయదు. ఈ నేపథ్యంలో అన్ని బలగాలతో సిద్ధం అవుతూ ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న అధికారపార్టీని ఢీకొనడం చిన్న విషయం కాదు. అయితే టిడిపి లో రోజు రోజు సీనియర్లు ఫ్యాన్ కిందకు చేరి గాలి పీలుస్తున్నారు. సైకిల్ కి తరచూ రాజమండ్రిలో పంచర్లు పడుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో టిడిపికి అభ్యర్థులే లేకుండా చేయాలన్న ఎత్తుగడతో ఎంపి భరత్ రామ్ టీం గట్టిగా దృష్టి పెట్టింది. ఇదే ఇప్పుడు ఆదిరెడ్డి టీం ను కలవరపెడుతుంది.
బుచ్చయ్య ఫార్ములా అమలు చేస్తారా ?
గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఆయన కార్పొరేషన్ ఎన్నికలకు అనుసరించిన మార్గాలని ఆదిరెడ్డి అనుసరిస్తారా లేదా అన్నది చూడాలి. రాజమండ్రి మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అవతరించిన తొలి ఎన్నికల్లో విశాఖ నుంచి దిగుమతి చేసుకున్న ఎం ఎస్ చక్రవర్తిని మేయర్ గా ప్రకటించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి . నాటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన వ్యూహం పనికొచ్చింది. టిడిపి విజయం సాధించింది. రెండోసారి ఆదిరెడ్డి అప్పారావు సతీమణికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ కి టిక్ పెట్టారు. పార్టీలో ఉన్నవారికి కాకుండా భర్త పార్టీలో ఉంటె భార్యకు ఎలా ఇచ్చేశారన్న విమర్శలు బుచ్చయ్య ఎదుర్కొన్నా నాటి వ్యూహం కూడా ఫలించింది. ఇక ముచ్చటగా మూడోసారి గోరంట్ల కాంగ్రెస్ నేత గా ఉన్న పంతం కొండలరావు భార్య పంతం రజని ని పార్టీలో చేర్చుకుని మేయర్ గా ప్రకటించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నాడు కూడా తీవ్ర విమర్శలనే ఆయన ఎదుర్కొన్నా అప్పటి వ్యూహం కూడా సక్సెస్ అయ్యి హ్యాట్రిక్ విజయాలు పార్టీ ఖాతాలో జమచేశారు గోరంట్ల. ఇలా త్రి టైమ్స్ కూడా పార్టీ జండా నేరుగా మోసిన వారికి కాకుండా కొత్త వారిని తెచ్చే గెలుపు తీరానికి చేర్చారు ఆయన. ఈసారి సరికొత్త వ్యూహంతోనే టిడిపి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది అంటున్నారు ఆ పార్టీ వర్గాలు.