Gorantla : బుచ్చన్న సాధించింది గుండుసున్నా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సాధించిందేమిటి? ఆయన రాజీనామా చేస్తానని చివరకు రాజీపడి ఆయన ఒరగబెట్టిందేమిటి? అన్న చర్చ మొదలయింది. ఇటీవల గోరంట్ల [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సాధించిందేమిటి? ఆయన రాజీనామా చేస్తానని చివరకు రాజీపడి ఆయన ఒరగబెట్టిందేమిటి? అన్న చర్చ మొదలయింది. ఇటీవల గోరంట్ల [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సాధించిందేమిటి? ఆయన రాజీనామా చేస్తానని చివరకు రాజీపడి ఆయన ఒరగబెట్టిందేమిటి? అన్న చర్చ మొదలయింది. ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా హడావిడి అందరికీ తెలిసిందే. దీంతో పెద్దాయన ఖచ్చితంగా రాజీనామా చేస్తారని భావించారు. ఆయన ఏకైక అజెండా రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు వర్గాన్ని సైడ్ చేయడం, తన వర్గానికి పదవులు ఇవ్వడం.
అంత హడావిడిగా….
గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలిగిన వెంటనే హడావిడిగా చంద్రబాబు త్రీ మెన్ కమిటీని నియమించారు. వారొచ్చి బుచ్యయ్యతో మాట్లాడారు. ఆల్ ఈజ్ వెల్ అని చెప్పారు. ఆ తర్వాత బుచ్చయ్య నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. బయటకు వచ్చి తాను రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. చంద్రబాబుకు తన సమస్యలన్నీ చెప్పుకున్నానని, పరిష్కరిస్తారన్న నమ్మకం తనకు ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.
ఏ ఒక్క డిమాండ్ ను….
కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ ఏ ఒక్కటి నెరవేరలేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉండబట్టే చంద్రబాబు అంత హడావిడి చేశారు. ఎమ్మెల్యే కాకుంటే దేకను కూడా దేకే వారు కాదు. కానీ అదే సమయంలో ఆదిరెడ్డి భవానీ కూడా ఎమ్మెల్యేగా ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆదిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేయరు. ఇప్పటికే బీసీ ఓటు బ్యాంకు దూరం కావడంతో బుచ్చయ్యకు సపోర్ట్ చేస్తే మరింత ఇబ్బంది అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఆదిరెడ్డికే…..
అందుకే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పెట్టిన డిమాండ్లు ఏ ఒక్కటీ చంద్రబాబు అమలు పర్చరు. అది బుచ్చయ్యకు కూడా తెలుసు. కాకపోతే ఆదిరెడ్డి బ్యాచ్ ను కొంత కంట్రోల్ లో పెట్టాలన్నదే ఆయన ఆలోచన. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా హడావిడి చేసి ఏం సాధించారంటే చెప్పలేం. వచ్చే ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. మరోవైపు రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదిరెడ్డిని దూరం చేసుకోలేరు. సో… టోటల్ గా బుచ్చన్న సాధించింది గుండుసున్నా.