బాబు, లోకేష్ ధోరణి వల్ల పార్టీ ప్రమాదంలో ?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలాకాలంగా చంద్రబాబు ధోరణి పార్టీకి ప్రమాదకరంగా ఉందని అప్పుడప్పుడు [more]
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలాకాలంగా చంద్రబాబు ధోరణి పార్టీకి ప్రమాదకరంగా ఉందని అప్పుడప్పుడు [more]
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలాకాలంగా చంద్రబాబు ధోరణి పార్టీకి ప్రమాదకరంగా ఉందని అప్పుడప్పుడు బాహాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఆయన కు పార్టీ ద్రోహం చేసిందనే చెప్పాలి. ఈ రెండు సార్లు రాజమండ్రి రూరల్ నుంచి టికెట్ ఇవ్వడానికి కూడా అధిష్టానం చాలా ఇబ్బందులు సృష్ట్టించింది. ఏడుసార్లు రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు బుచ్చయ్య. రూరల్ నుంచి రెండు సార్లు విజయం సాధించి ఆరుసార్లు మొత్తంగా ఎమ్యెల్యే అయ్యారు.
ఎన్టీఆర్ హయాంలోనే…?
ఎన్టీఆర్ హయాంలో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. ఇక ఆయన పార్టీలో అధ్యక్షుడు తప్ప ప్రస్తుత పాలిట్ బ్యూరో మెంబర్ తో సహా చూస్తే అన్ని పదవులు చేపట్టినట్లే. ఎప్పుడు పార్టీ అభివృద్ధి కోసం అధినేతను సైతం ధిక్కరించే స్వభావమే ఆయనకు మరోసారి మంత్రి పదవులు దక్కకుండా చేసింది.
చాలాకాలంగా అవమానాలు భరిస్తూ …
దీనికి తోడు పార్టీలోకి వచ్చి వెళ్లే ఆయారాం గయారాం లకు అగ్రపీఠం వేయడం సీనియర్లను అవమానించడం చాలాకాలంగా టిడిపి అధిష్టానం చేస్తున్నా సహిస్తూ, భరిస్తూ వస్తున్నారు గోరంట్ల. ఇక లోకేష్ పట్టు పార్టీలో పెరుగుతున్న క్రమంలో అధిష్టానంతో గోరంట్ల సఖ్యత మరింత సన్నగిల్లింది.
ఆదిరెడ్డి కుటుంబానికి….
దానికి తోడు పార్టీ ఆవిర్భావం నుంచి రాజమండ్రిని టిడిపికి కంచుకోటగా మలచుకుంటే ఆదిరెడ్డి కుటుంబాన్ని తెచ్చి వారికి అగ్రాసనం వేయడంతో ఆయన కోపం తారాస్థాయిలో ఉంది. అన్ని అణచుకుని పార్టీకోసం అహరహం పనిచేస్తున్నా గుర్తింపు అంశంలో చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్న తీరు మరింత కలచివేస్తుంది ఆయన్ను. ఇవన్నీ భరిస్తూ కొనసాగడం కన్నా రాజకీయాలకు స్వస్తి పలకాలన్న ఆలోచనతోనే బుచ్చయ్య కఠిన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు ఆయన వర్గీయుల సమాచారం.