అప్పటినుంచే మరీ దూరం పెట్టారా …?
ఆ మధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబు, లోకేష్ లను డిఫెన్స్ లో పడేసినట్లు రాజకీయ విశ్లేషకులు [more]
ఆ మధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబు, లోకేష్ లను డిఫెన్స్ లో పడేసినట్లు రాజకీయ విశ్లేషకులు [more]
ఆ మధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబు, లోకేష్ లను డిఫెన్స్ లో పడేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా అలాంటివారంతా వస్తేనే పార్టీకి పూర్వవైభవం దక్కుతుందని గోరంట్ల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పార్టీలో ఆయన ప్రత్యర్ధులు అగ్నికి ఆజ్యం పోసేలా అధిష్టానం చెవిలో మరింతగా చెప్పడంతో బాబు లోకేష్ పూర్తిగా ఆయనతో టచ్ లోకి లేకుండా పోయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఎమ్యెల్యేగా టికెట్ ఇచ్చాం కాబట్టి ఇదే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చివరి ఛాన్స్ అని అధిష్టానం డిసైడ్ అయిపొయింది. ప్రస్తుతం బుచ్చయ్య వారసులు రాజకీయంగా ఎవరు లేరు. ఆయన సోదరుడి కుమారుడు డాక్టర్ గోరంట్ల రవికిరణ్ మాత్రం సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ వుంటారు. వస్తే గిస్తే ఆయనే బుచ్చయ్య రాజకీయ వారసుడు గా ఆయన తప్పుకుంటే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
వాడుకుని వదిలేస్తున్న బాబు …
గోరంట్ల బుచ్చయ్య చౌదరి విద్యార్థి దశలో రాడికల్ యూనియన్ లో చురుగ్గా ఉండేవారు. డిగ్రీ పూర్తి అయ్యాకా వ్యాపార రంగంలోకి వచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ బృందంలో ఎన్టీఆర్ తో జత కలిసి ముఖ్య పాత్రనే వహించారు. ఆయనపై ఎన్టీఆర్ ఉంచిన నమ్మకం తో తూర్పుగోదావరి జిల్లాల్లో టిడిపి జండాను రెపరెపలాడించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు వర్గం లో బుచ్చయ్య ముఖ్య నేతగా ఉండేవారు. చంద్రబాబు వెన్నుపోటు సమయంలో కూడా ఎన్టీఆర్ వెంటే నడిచి ఆయన మరణం తరువాత కొంతకాలం లక్ష్మీపార్వతి కొనసాగించిన పార్టీలో ఉండి 1999 ఎన్నికల ముందు తిరిగి చంద్రబాబు చెంతకు చేరారు. అవసరానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సేవలను ఉపయోగించుకున్న బాబు ఆయన సీనియారిటీకి తగ్గ హోదాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్పించలేదు. జగన్ హవాతో ఎపి లో టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో గోరంట్లకు ఎట్టకేలకు పాలిట్ బ్యూరో సభ్యుడిని చేశారు చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా తన విషయంలో వ్యవహరిస్తున్న చంద్రబాబు లోకేష్ లు ఇటీవల మరీ చిన్నన్న ను తీసిపారేయడం ఆయన తట్టుకోలేక పోయినట్లు తెలుస్తుంది.
వైసీపీకే చిన్నన్న …
ఈ నేపథ్యంలో పార్టీకి గుడ్ బై కొట్టేస్తే అందరిలాగే వైసిపి వైపు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చూస్తారా లేక చేసిన రాజకీయాలు చాలు అని అన్నిటికి దూరంగా వానప్రస్థాశ్రమం చేపడతారా అన్నది చూడాలి. గోరంట్ల వంటి సీనియర్ వస్తే మాత్రం వైసిపి లో ఆయనకు జగన్ పెద్దపీట వేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి చంద్రబాబు ను దుమ్మెత్తి పోయడంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారు దూసుకుపోతున్నారు. చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన బలమైన బుచ్చయ్య చౌదరి వంటి రాజకీయ ఉద్దండుడు వస్తే వైసిపి మరింత దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోరంట్ల తన కఠిన నిర్ణయంలో మార్పు చేసుకొని పక్షంలో ఆయనకు జగన్ రెడ్ కార్పెట్ గ్యారంటీ అనే చెప్పొచ్చు. చూడాలి మరి ఏమి జరగనుందో.