గొట్టిపాటి తట్టుకుంటారా? తేలిపోతారా?
ఒకే ఒక్కడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారాడు. జగన్ సీటు ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి జగన్నే కాదని బయటకు వచ్చిన సదరు నేత [more]
ఒకే ఒక్కడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారాడు. జగన్ సీటు ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి జగన్నే కాదని బయటకు వచ్చిన సదరు నేత [more]
ఒకే ఒక్కడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారాడు. జగన్ సీటు ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి జగన్నే కాదని బయటకు వచ్చిన సదరు నేత జగన్‌ను ధిక్కరించినోళ్లందరూ చిత్తుగా ఓడినా తాను మాత్రం మళ్లీ గెలిచాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వం నుంచి ఎన్ని ఎటాక్‌లు ఎదురవుతున్నా అంతే ధైర్యంతో నిలబడుతున్నాడు. సదరు నేత ఎవరో కాదు ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. ఓటమి లేకుండా వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తోన్న రవి 2014లో వైసీపీ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి జంప్ కొట్టేశారు.
జగన్ కు హ్యాండిచ్చి…..
2019 ఎన్నికల్లో జగన్‌కు హ్యాండ్ ఇచ్చి పార్టీ ఫిరాయించిన నేతలు అందరూ టీడీపీలో చిత్తుగా ఓడినా కూడా గొట్టిపాటి జగన్ భీభత్సమైన ప్రభంజనం కూడా తట్టుకుని మరీ ఘనవిజయం సాధించారు. అంతే అప్పటి నుంచి గొట్టిపాటి రవికుమార్ జగన్ ప్రభుత్వానికి గట్టి టార్గెట్ అయిపోయారనే అంటున్నారు. పదే పదే గొట్టిపాటి వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయి. విజిలెన్స్ వాళ్లు సైతం ప్రభుత్వం నుంచి వస్తోన్న వరుస ఆదేశాలతోనే ఆయన గ్రానైట్, ఇతర వ్యాపారాలపై దాడులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని భోగట్టా ? ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుటుంబాన్ని ప్రభుత్వం టార్గెట్ చేయగా.. ఆయన చివరకు వైసీపీ కండువా కప్పుకుని సేఫ్ అయ్యారు.
పార్టీ మారేందుకు….
గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారేందుకు ఇష్టపడకపోవడంతో ఆయన్ను టార్గెట్ చేయడం ఆపలేదు. జిల్లాలోని చీమకుర్తి ప్రాంతంలో గొట్టిపాటికి ఉన్న గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు పదే పదే దాడులు చేయగా అక్కడ మైనింగ్ కొద్ది రోజుల పాటు ఆగిపోయింది. దీంతో రవి తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆయన నియోజకవర్గంలో మరింత యాక్టివ్ అవ్వడంతో ఈ సారి ఆయన క్రషర్లు, మైనింగ్ కార్యకలాపాలు ఎక్కడ ఉన్నా అక్కడ వరుస పెట్టి దాడులు చేస్తున్నారు. తాజాగా చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలంలోని యడపల్లి, గణపవరం దగ్గర ఉన్న మూడు గ్రానైట్ ఫ్యాక్టరీల్లో అధికారులు వరుస దాడులు చేశారు.
ఆర్థిక సాయం అందిస్తారని…..
ఇక పరుచూరు నియోజకవర్గం మార్టూరు మండలంలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలపై కూడా ఈ దాడులు తప్పలేదు. గొట్టిపాటి రవికుమార్ తన అద్దంకి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు ఆర్థికంగా అండదండలు అందిస్తారన్న అంచనాలతోనే ఆయన కంపెనీలపై ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఈ దాడులు జరుగుతున్నట్టు సందేహాలు ఉన్నాయి. ఇప్పటికీ అద్దంకిలో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది.
తట్టుకుంటూనే…?
దీనికి తోడు ఆయన ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తోన్న పార్టీ అభ్యర్థులకు సాయం అందిస్తున్నారట. ఆ మాటకు వస్తే గొట్టిపాటి రవికుమార్ జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్లకు ఫండింగ్ చేస్తున్నారట. ఆయన్ను కంట్రోల్ లోకి తెచ్చుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీకి అసలు ప్లేసే లేకుండా చేయాలని వైసీపీ ప్లాన్. మరి ఈ కొరకరాని కొయ్య గొట్టిపాటి రవికుమార్ వైసీపీ ఎటాక్‌ను ఎలా తట్టుకుంటారో ? చూడాలి