గొట్టిపాటికి చేరికకు అడ్డంకి ఆయనేనట?
రామేశ్వరం వెళ్లినా.. శనేశ్వరం తప్పలేదన్నట్టుగా ఉంది టీడీపీ ఎమ్మెల్యే, యువ నాయకుడు.. గొట్టిపాటి రవికుమార్ రాజకీయ పరిస్థితి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు [more]
రామేశ్వరం వెళ్లినా.. శనేశ్వరం తప్పలేదన్నట్టుగా ఉంది టీడీపీ ఎమ్మెల్యే, యువ నాయకుడు.. గొట్టిపాటి రవికుమార్ రాజకీయ పరిస్థితి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు [more]
రామేశ్వరం వెళ్లినా.. శనేశ్వరం తప్పలేదన్నట్టుగా ఉంది టీడీపీ ఎమ్మెల్యే, యువ నాయకుడు.. గొట్టిపాటి రవికుమార్ రాజకీయ పరిస్థితి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించినా.. ఆయన ఎన్నడూ మనస్సాంతిగా గడిపిన రోజంటూ లేకపోవడమే దీనికి కారణం అంటున్నారు పరిశీలకులు. 2014లో వైసీపీ తరఫున విజయం సాధించిన ఆయన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాపారాలు నష్టపోవడం, అప్పటి అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు.. ఆయనను కలచి వేశాయి. ఈ క్రమంలోనే గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. దీంతో వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
అప్పట్లోనూ అంతే…
అంతకంటే ముందు గొట్టిపాటి రవికుమార్ రాజకీయం చూస్తే 2004లో మార్టూరు నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ 2009లో అద్దంకి నుంచి గెలిచారు. ఆ తర్వాత వైఎస్ మృతి తర్వాత ఆయన రాజకీయంగా కాంగ్రెస్‌లో ఉండాలా ? వైసీపీలోకి వెళ్లాలా ? అని గందరగోళ పరిస్థితుల్లో ఉండగా కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను అద్దంకితో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట కాంగ్రెస్ పగ్గాలు కూడా అప్పగించింది. ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసిన ఆయన 2014లో వైసీపీ నుంచి గెలిచి అప్పటి అధికార టీడీపీలో చేరారు. పార్టీకి ద్రోహం చేశారంటూ.. అప్పట్లో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల నుంచి చీవాట్లు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ.. వ్యా పార లావాదేవీలు, స్థానిక రాజకీయాల్లో పైచేయి సాదించేందుకు ఆయన పార్టీ మారక తప్పలేదు.
ఇప్పుడూ అదే సీన్….
ఇక, 2019లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టీడీపీ తరఫున తిరిగి అద్దంకి నుంచే గొట్టిపాటి రవికుమార్ పోటీ చేశారు. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, ఆయన పార్టీ మళ్లీ అధికారం కోల్పోయింది. ఏ పార్టీ నుంచి అయితే గొట్టిపాటి రవికుమార్ బయటకు వచ్చి.. టీడీపీలో చేరారో.. ఆ పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ పాత సీన్ రిపీట్ అయింది. మరోసారి వ్యాపారాలపైనా, స్థానిక రాజకీయాలపైనా తీవ్ర ఒత్తిళ్లు పడుతున్నాయి. వ్యాపారాలు మానుకోవడం, స్థానికంగా సైలెంట్‌గా ఉండడం అనేది గొట్టిపాటి రవికుమార్ కి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పునకు ఆయన ప్రయత్నిస్తున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేగా ఉన్నా…
అయితే, ఈ విషయంలోనూ టీడీపీ నుంచి మళ్లీ విమర్శల బాణాలు మొదలయ్యాయి. మాపార్టీ టికెట్‌పై విజయం సాధించి.. పార్టీకి వెన్నుపోటు పొడుస్తారా ? అంటూ… టీడీపీ నుంచి మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. పోనీ.. పార్టీ మారకుండా ఉందామంటే.. వ్యాపారాలపై అధికార పార్టీ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఎదురయ్యాయి. అదే సమయంలో స్థానికంగా కూడా ఏ అధికారి కూడా తన మాటలను పట్టించుకోవడం లేదు. ప్రజాక్షేత్రంలో గెలుపుగుర్రం ఎక్కినా.. వానపాము మాదిరిగా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోందని గొట్టిపాటి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలో చేరదామనుకున్నా….
అదే సమయంలో తమ కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కరణం బలరాం కుటుంబం ఇప్పటికే వైసీపీలో చేరిపోయింది. వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుంచి కరణం తనయుడు వెంకటేష్ పోటీ చేస్తారని అంటున్నారు. ఈ టైంలో ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వెళ్లినా పదవుల పరంగా ఏం ప్రయోజనం లేదు. మరోవైపు అద్దంకి వైవి. సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఆయన గొట్టిపాటి రవికుమార్ ఎంట్రీకి సుముఖంగా లేరని అంటున్నారు. మరో వైపు జిల్లాకే చెందిన మంత్రి బాలినేని మాత్రం రవిని టీడీపీకి దూరం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక గొట్టిపాటి తలపట్టుకుంటున్నారట.