గొట్టిపాటికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనా?
ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే వ్యక్తి గొట్టిపాటి రవికుమార్. కానీ ఆయన పేరు మాత్రం ఎప్పుడూ మీడియాలో నలుగుతూనే ఉంటుంది. దీనికి కారణం ఆయన పార్టీలు వరసగా [more]
ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే వ్యక్తి గొట్టిపాటి రవికుమార్. కానీ ఆయన పేరు మాత్రం ఎప్పుడూ మీడియాలో నలుగుతూనే ఉంటుంది. దీనికి కారణం ఆయన పార్టీలు వరసగా [more]
ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే వ్యక్తి గొట్టిపాటి రవికుమార్. కానీ ఆయన పేరు మాత్రం ఎప్పుడూ మీడియాలో నలుగుతూనే ఉంటుంది. దీనికి కారణం ఆయన పార్టీలు వరసగా మారుతుండటమే. గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఈ మేరకు ఆయన నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. తన వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో గొట్టిపాటి రవికుమార్ అనివార్యంగా పార్టీ మారాల్సి వస్తుందని ఆయన అనుచరులు అంటున్నారు.
కరణం కంటే ముందుగానే…..
నిజానికి గొట్టిపాటి రవికుమార్ ఆయన ప్రత్యర్థి కరణం బలరాం కంటే ముందుగా వైసీపీలోకి రావాల్సి ఉంది. కానీ అప్పట్లో ఆయన అంగీకరించలేదు. అద్దంకి నుంచి కరణం ఫ్యామిలీని చంద్రబాబు సక్సెస్ ఫుల్ గా చీరాలకు పంపడంతో తనకు తిరుగులేదని గొట్టి పాటి రవికుమార్ భావించారు. చంద్రబాబు తన కోసం తీసుకున్న నిర్ణయానికి తాను పార్టీలో ఉండి ఆయనకు అండగా నిలవాలని గొట్టిపాటి రవికుమార్ భావించారు.
ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో….
ికరణం కుటుంబం వైసీపీలో చేరడంతో ఇక గొట్టిపాటి రవికుమార్ పార్టీని విడచి వెళ్లరని టీడీపీ నాయకత్వం కూడా ఊపిరి పీల్చుకుంది. దీంతో ఆయన వ్యాపార సామ్రాజ్యంపై అధికార పార్టీ దాడులు ప్రారంభించింది. కోట్ల రూపాయలు జరిమానా విధించడంతో పాటు మైనింగ్ వ్యాపారాన్ని సీజ్ చేసింది. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లి కొంత ఊరట చెందినా నిత్యం ప్రభుత్వంతో తన వ్యాపారానికి ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో గొట్టిపాటి రవికుమార్ వైసీపీలోకి వెళ్లడమే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రితో భేటీ?
గొట్టిపాటి రవికుమార్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య మంచి స్నేహం ఉంది. వారి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరుగుతుంటాయంటారు. ఇటీవల గొట్టిపాటి రవికుమార్ హైదరాబాద్ లో మంత్రి బాలినేనితో భేటీ అయినట్లు తెలుస్తోంది. తనకు అద్దంకి నియోజకవర్గంపై టిక్కెట్ హామీ ఇవ్వాలని, కరణం ఫ్యామిలీని అద్దంకి నియోజకవర్గానికి రాకుండా చేయాలని ఆయన షరతు విధించినట్లు చెబుతున్నారు. దీనికి బాలినేని కూడా తలాడించారంటున్నారు. అయితే అధినాయకత్వంతో ఒక మాట చెప్పిన తర్వాత గొట్టిపాటి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారంటున్నారు. మొత్తం మీద గొట్టి పాటి రవికుమార్ టీడీపీని వీడితే ఆ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇటు కరణం, అటు గొట్టిపాటి పార్టీని వీడటం ఇబ్బందికర పరిణామమేనంటున్నారు.