గొట్టి పాటి ఆవేదన విన్నారా?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అధినాయకత్వం పార్టీని పట్టించుకోక పోవడం, క్యాడర్ లో నమ్మకం లేకపోవడంతో ఇక పార్టీలో ఉండి [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అధినాయకత్వం పార్టీని పట్టించుకోక పోవడం, క్యాడర్ లో నమ్మకం లేకపోవడంతో ఇక పార్టీలో ఉండి [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అధినాయకత్వం పార్టీని పట్టించుకోక పోవడం, క్యాడర్ లో నమ్మకం లేకపోవడంతో ఇక పార్టీలో ఉండి ఏం చేయాలని ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ఆర్థికంగా తీవ్ర నష్టపరిచినా తట్టుకుని నిలబడినా తనకు అధినాయకత్వం అండగా నిలబడలేదన్నది గొట్టిపాటి రవికుమార్ అభియోగంగా కన్పిస్తుంది.
వైసీపీలోకి తెచ్చేందుకు….
గొట్టిపాటి రవికుమార్ ను వైసీపీలోకి తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆయన తిరిగి వైసీపీలోకి రాకపోవడంతో ఆయన చిరకాల ప్రత్యర్థి కరణం బలరాంను చేర్చుకున్నారు. అప్పట్లో నారా లోకేష్ స్వయంగా హామీ ఇవ్వబట్టే టీడీపీలో గొట్టిపాటి రవికుమార్ చేరారు. లోకేష్ హామీ ప్రకారం టీడీపీ కరణం ఫ్యామిలీని అద్దంకి నుంచి పక్కకు తప్పించి చీరాలకు పంపింంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గొట్టిపాటి రవికుమార్ ను టార్గెట్ చేసింది.
వరస దాడులతో…..
ఆయనకు ఆర్థికంగా బలమైన గ్రానైట్ క్వారీలపై వరస దాడులు జరిగాయి. దాదాపు వందకోట్ల జరిమానా విధించారు. గ్రానైట్ తవ్వకాలను నిలిపేవారు. జరిమానాపై న్యాయస్థానానికి వెళ్లి గొట్టిపాటి రవికుమార్ స్టే తెచ్చుకున్నా క్వారీలు ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ తన అనుచరులను గెలిపించుకోవడానికి గొట్టిపాటి రవికుమార్ బాగా ఖర్చు చేశారని టాక్. అయినా ఫలితం దక్కలేదు.
క్యాడర్ నుంచి…..
దీంతో తన విషయంలో టీడీపీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదన గొట్టిపాటి రవికుమార్ తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శలు తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదని ఆయన భావిస్తున్నారు. గగొట్టిపాటి రవికుమార్ అనుచరులు సయితం ఆయన పై వత్తిడి తెస్తున్నారట. ఇక్కడ ఉండి బావుకునేది ఏమీ లేకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని, వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయనపై ప్రెజర్ పెడుతున్నారు. అయితే కరణం ఫ్యామిలీ వైసీపీలో ఉండటంతో గొట్టిపాటి రవికుమార్ అనివార్యంగా టీడీపీలోనే ఉండే అవకాశముంది. పార్టీ పై అసంతృప్తిని మాత్రం ఆయన త్వరలోనే బహిరంగంగా వెళ్లగక్కే అవకాశముందంటున్నారు.