మైండ్ గేమ్‌తో ఈ నాయకురాలి భవిష్యత్ ఏమైందంటే?
ఒక్క విజయం.. రాజకీయ నేతలకు మనో ధైర్యం ఇస్తే.. అది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అదే.. ధైర్యం వ్యక్తిగతానికి పరిమితమైతే.. తమకే నష్టం చేస్తుంది.. ఇది [more]
ఒక్క విజయం.. రాజకీయ నేతలకు మనో ధైర్యం ఇస్తే.. అది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అదే.. ధైర్యం వ్యక్తిగతానికి పరిమితమైతే.. తమకే నష్టం చేస్తుంది.. ఇది [more]
ఒక్క విజయం.. రాజకీయ నేతలకు మనో ధైర్యం ఇస్తే.. అది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అదే.. ధైర్యం వ్యక్తిగతానికి పరిమితమైతే.. తమకే నష్టం చేస్తుంది.. ఇది గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్న మాట. అంటే .. నాయకులు విజయం చూసి కైపెక్కకుండా జాగ్రత్తలు పడాలనేది ఆయన చెప్పిన మాటలోని అంతః సూత్రం. దీనికి ఎవరూ అతీతులు కారు. కానీ, ఒకరిద్దరు మాత్రం ఒక్కసారి గెలుపునకే మిడిసి పడిన నాయకులు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఒకరు అంటున్నారు స్థానిక రాజకీయ విశ్లేషకులు.
వైఎస్ ఫ్యామిలీకి…..
వైఎస్ ఫ్యామిలీకి అనుంగు అనుచరురాలిగా గుర్తింపు తెచ్చుకున్న గౌరు చరితారెడ్డి వైసీపీ తరఫున 2014లో పాణ్యం నుంచి విజయం సాధించారు. అయితే, పార్టీ అధికారంలోకి రాలేదు. పైగా జిల్లాలో అప్పటికే వైసీపీ తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి (దివంగత) వంటి వారు పార్టీ మారిపోయి.. సైకిల్ ఎక్కారు. దీంతో గౌరు చరితారెడ్డికి కూడా టీడీపీ నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే, తాను జగన్‌కు నమ్మిన బంటునని ఆమె ప్రకటించుకుని, పార్టీలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే టీడీపీ మైండ్ గేమ్‌కు తెరదీసింది. పాణ్యం టికెట్‌ను జగన్ 2019లో ఇవ్వబోరంటూ.. తన అనుకూల మీడియాలో గౌరుకు అటు అనుకూలం, ఇటు వ్యతిరేకం కాకుండా వార్తలు రాయించారన్న పుకార్లు వినిపించాయి.
జగన్ నిర్ణయం చెప్పక ముందే….
ఈ గేమ్‌లో చిక్కుకున్న గౌరు చరితారెడ్డి ఇదే విషయంపై జగన్‌ను నిలదీశారు. అయితే, ఎవరి టికెట్ వారికే ఉంటుందని జగన్ చెప్పారు. అయినా కూడా ఈ మైండ్ గేమ్ ప్రభావంతో ఆమె పార్టీ వదిలేసి బయటకు వచ్చా రు. పైగా తాను ఏ పార్టీలో ఉన్నా గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని గౌరు చరితారెడ్డి భావించారు. దీనికి ఆమె భర్త కూడా తోడయ్యారు. తీరా చూస్తే.. గత ఏడాది ఎన్నికల్లో 43 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అదే వైసీపీలో ఉండి ఉంటే.. టికెట్ రాకున్నా.. ఏదైనా నామినేటెడ్ పదవైనా దక్కి ఉండేది. కానీ, గౌరు చరితా రెడ్డి టీడీపీలోకి వచ్చారు.
పార్టీ పరిస్థిితిని చూస్తే….
ఇక, ఇప్పుడు జిల్లాలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎవరు పార్టీని ముందుకు నడిపిస్తారనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎవరికివారే యమునా తీరే అన్నవిధంగా ఉన్నప్పటికీ.. పార్టీ అధినేత చంద్రబాబు ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఇక, జూనియర్లు తమ తమ నియోజకవర్గాలు సహా నాయకులు లేని నియోజకవర్గాల్లోనూ చక్రంతిప్పుతున్నారు. దీంతో పాణ్యంలో గౌరు చరితారెడ్డి పరిస్థితి ఏమీ పాలుపోవడం లేదు. పోనీ.. టీడీపీని వదిలేసి వచ్చి వైసీపీలో చేరదామా? అంటే.. ఇప్పుడు వైసీపీలోనూ గేట్లు మూసేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లినా ఆమెకు ఎలాంటి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఒక్క మైండ్‌గేమ్‌తో తన రాజకీయ జీవితం ఇలా అయిందేంటా ? అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.