గౌరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారటగా
గౌరు ఫ్యామిలీ… వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా పేరుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే గౌరు చరిత ఆయనకు ఆప్తురాలిగా కొనసాగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి [more]
గౌరు ఫ్యామిలీ… వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా పేరుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే గౌరు చరిత ఆయనకు ఆప్తురాలిగా కొనసాగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి [more]
గౌరు ఫ్యామిలీ… వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా పేరుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే గౌరు చరిత ఆయనకు ఆప్తురాలిగా కొనసాగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గౌరు చరిత కుటుంబం గత ఎన్నికలలో తప్పు చేసింది. వైఎస్ మరణం తర్వాత ఆయన తనయుడు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. వైఎస్ జగన్ పాదయాత్రలో సయితం గౌరు చరిత పాల్గొన్నారు. పాణ్యం టిక్కెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. జగన్ తమకు అన్యాయం చేయడని భావించారు.
కాటసాని చేరికతో….
కానీ పాణ్యం నియోజకవర్గంలో బలమైన నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. గౌరు కుంటుంబం కంటే బలమైన నేత కాటసాని కావడంతో ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బయటకు చెప్పకపోయినా జగన్ నుంచి అలాంటి సంకేతాలు వెలువడ్డాయి. తాను చెల్లెలిగా భావించే గౌరు చరితకు అన్యాయం చేయకూడదనుకున్నారు. గౌరు కుటుంబంలో చరితకు గాని, వెంకటరెడ్డికి గాని వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనుకున్నారు.
టీడీపీలో చేరినా….
విషయం తెలిసిన గౌరు చరిత కుటుంబం రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తమ అనుచరులతో సమావేశమై తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పాణ్యం టిక్కెట్ ను సాధించుకున్నారు. కానీ గత ఎన్నికల్లో దాదాపు 44 వేల ఓట్ల తేడాతో గౌరు చరిత ఓటమి పాలయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ గౌరు కుటుంబం వైఎస్ జగన్ పై విమర్శలు చేయలేదు. తనకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని గురించి మాత్రమే వారు ప్రస్తావించారు.
కీలక నేత ద్వారా…..
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుని పోవడంతో గౌరు చరిత తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలసింది. ఈ మేరకు జగన్ కు సన్నిహితంగా ఉండే చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుడితో మంతనాలు సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో తనను కాదని వెళ్లిపోయిన గౌరు చరితను తిరిగి జగన్ పార్టీలో చేర్చుకుంటారా? అన్నది వారికి అనుమానమే. అయినా వారు ప్రయత్నించారట. జగన్ కూడా వారి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాటసాని రాంభూపాల్ రెడ్డి సయితం గౌరు కుటుంబం చేరిక తనకు అభ్యంతరం లేదని చెప్పడంతో జగన్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీలో సేద తీరడానికి రెడీ అవుతున్నారు గౌరు చరిత.