ఏపీ లో అదానీ పంట పండినట్లే …?
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ గుప్పిట్లోకి వెళ్లబోతుంది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అనుకూలంగా, ఆదాయ వనరుగా ఉండటంతో ఇక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ గుప్పిట్లోకి వెళ్లబోతుంది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అనుకూలంగా, ఆదాయ వనరుగా ఉండటంతో ఇక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ గుప్పిట్లోకి వెళ్లబోతుంది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అనుకూలంగా, ఆదాయ వనరుగా ఉండటంతో ఇక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు అదానీ రెడీ అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న తీర ప్రాంతాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అదానీ సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఉండటంతో ఇక అదానీ పంట పండినట్లేనంటున్నారు.
ఆధిపత్యం కోసం….
అదానీ గ్రూపు పోర్టులపై ఆధిపత్యం కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే గంగవరం పోర్టును అదానీ తమ హస్తగతం చేసుకున్నారు. ప్రభుత్వ వాటా మినహా మిగిలిన వాటాను దక్కించుకున్నారు. ఇక తాజాగా కృష్ణ పట్నం పోర్టు కూడా వందశాతం అదానీ సొంతమయింది. గత ఏడాది కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు కొద్ది రోజుల క్రితం మిగిలిన 25 శాతం వాటాలను కొనుగోలు చేసి పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఈ 25 శాతం వాటా 2,800 కోట్లట.
ఈ పోర్టులను కూడా….
రాష్ట్ర ప్రభుత్వం కూడా పోర్టులకు ప్రత్యేక ప్రయారిటీ ఇస్తుంది. రామాయపట్న, బందరు, భావనపాడు పోర్టులను నిర్మించాలని భావిస్తుంది. ఎన్నికలలోపే వేగవంతం చేయాలని ఏపీ ముఖ్మమంత్రి జగన్ భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పోర్టులను కూడా అదానీ గ్రూపు సొంతం చేసుకుంటుందన్న ప్రచారం ఊపందుకుంది. అదానీని తట్టుకునే శక్తి, సత్తా మరెవ్వరికీ లేవంటున్నారు.
ప్రభుత్వ సహకారం కూడా….?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదానీ గ్రూపు ఎంటర్ కావడం శుభపరిణామమని భావిస్తున్నాయి. అదానీ సంస్థ నిర్మాణ ప్రక్రియ చేపడితే వెంటనే నిర్మాణ పనులు పూర్తవుతాయని, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇది తమకు వచ్చే ఎన్నికల్లో సానుకూల అంశంగా మారుతుందని జగన్ విశ్వసిస్తున్నారు. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా అదానీ గ్రూపు పట్ల సుముఖంగా ఉండటంతో ఇక అదానీ పంట ఏపీలో పండినట్లేనంటున్నారు.