గౌతు శిరీష ఫ్యూచర్ చంద్రబాబు ఇలా డిసైడ్ చేశారా?
తెలుగు రాజకీయాల్లో గౌతు ఫ్యామిలీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న, ఆయన తనయుడు గౌతు శివాజీ ఇద్దరు కలిసి [more]
తెలుగు రాజకీయాల్లో గౌతు ఫ్యామిలీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న, ఆయన తనయుడు గౌతు శివాజీ ఇద్దరు కలిసి [more]
తెలుగు రాజకీయాల్లో గౌతు ఫ్యామిలీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న, ఆయన తనయుడు గౌతు శివాజీ ఇద్దరు కలిసి పది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇలాంటి అరుదైన చరిత్ర దేశంలోనే ఏ తండ్రి కొడుకులకు లేదు. అలాంటి ఫ్యామిలీలో మహిళా రాజకీయ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు శివాజీ కుమార్తె గౌతు శిరీష. గత ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన గౌతు శిరీష ప్రస్తుత మంత్రి సీదిరి అప్పలరాజు చేతిలో ఓడిపోయారు. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌతు శిరీష జిల్లాలో ఉద్దండులు అయిన నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించారు.
సీనియర్ నేతలను కలుపుకుంటూ….
మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకటరావు, మాజీ విప్ కూన రవికుమార్, మరో మాజీ మంత్రి కుటుంబం అయిన గుండ ఫ్యామిలీ, కలమట వెంకటరమణ లాంటి సీనియర్ నేతలను కలుపుకుంటూ గౌతు శిరీష పార్టీని ముందుకు నడిపించారు. అయితే ఎన్నికల్లో గౌతు శిరీష ఓడిపోయాక ఆమె జిల్లా రాజకీయాల్లోనూ, పలాస రాజకీయాల్లోనూ సైలెంట్ అయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యక్రమాల్లో మాత్రం ఆమె యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అనుసరిస్తోన్న రాజకీయ వ్యూహాల నేపథ్యంలో గౌతు శిరీషను జిల్లా పార్టీ పగ్గాల నుంచి తప్పించి ఆమెను రాష్ట్ర స్థాయిలో కీలక పదవిలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కూనకేనా జిల్లా పగ్గాలు ..?
జిల్లాలో అధికార వైసీపీ క్యాస్ట్ ఈక్వేషన్లతో పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ దూకుడుకు చెక్ పెట్టాలంటే దూకుడుగా రాజకీయం చేసే మాజీ విప్ కూన రవికుమార్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని బాబు భావిస్తున్నారట. ఇక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు ఎలాగూ ఏపీ టీడీపీ అధ్యక్ష రేసులో వినిపిస్తోంది. రెండు కీలక పదవులు జిల్లాలో రెండు పెద్ద సామాజిక వర్గాలకు ఇస్తే వైసీపీ ఈక్వేషన్లకు ధీటుగా ఉంటుందన్నదే బాబు ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గౌతు శిరీషను జిల్లా పార్టీ పగ్గాల నుంచి తప్పిస్తే ఆమెకు పార్టీ తరపున రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించాలన్నదే బాబు ప్లాన్.
కోర్ టీంలో…..
ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏపీలోని 13 జిల్లాల నుంచి యువనేతలను ఎంపిక చేసి కోర్ టీంలోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. గౌతు శిరీషను ఈ కోర్ టీంలోకి తీసుకోవడంతో పాటు పార్టీ తరపున రాష్ట్ర స్థాయి పదవి కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. నిన్నటి వరకు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన గౌతు శిరీష ఇప్పుడు రాష్ట్రస్థాయి రాజకీయాల్లో రాణించే దిశగా వర్క్ ప్రారంభించడంతో పాటు జిల్లాల వారీగా తమ కుటుంబ అభిమానులు, తమ సామాజిక వర్గ నేతలతో టచ్‌లో ఉంటున్నారు.