ఎవరిది తప్పు…?
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు లో జరిగిన ప్రమాదం తరువాత ఈ తప్పులు సవరించుకోకపోతే నేరపూరిత నిర్లక్ష్యమే. గోదావరిలో జరిగిన ఘోర బోటు ప్రమాదానికి కారణాలు [more]
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు లో జరిగిన ప్రమాదం తరువాత ఈ తప్పులు సవరించుకోకపోతే నేరపూరిత నిర్లక్ష్యమే. గోదావరిలో జరిగిన ఘోర బోటు ప్రమాదానికి కారణాలు [more]
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు లో జరిగిన ప్రమాదం తరువాత ఈ తప్పులు సవరించుకోకపోతే నేరపూరిత నిర్లక్ష్యమే. గోదావరిలో జరిగిన ఘోర బోటు ప్రమాదానికి కారణాలు చాలానే వున్నాయి. ఒకటి ఐదు లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో గోదావరి ఉధృతంగా వున్న సమయంలో ఇరిగేషన్ అధికారులు అనుమతించడం. వారి అనుమతి లేదని ప్రమాదం జరిగాక ప్రకటించింది. అయితే అనుమతి లేని బోటు ను అడ్డుకోవాలిసిన యంత్రాంగం ఎక్కడ నిద్ర పోతుంది.
పోలీసుల చెక్ కూడా తూతూ మంత్రమే …
వీరి తరువాత పోలీసులు చేసిన తప్పు ఇక్కడ చెప్పక తప్పదు. పాపికొండలు వెళ్ళి వచ్చే బోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది దేవీపట్నం పోలీస్ స్టేషన్ అధికారులు. ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది. బోటు ఆపరేటర్ ఈ స్టేషన్ కు వెళ్ళి పర్యాటకులు ఎంతమంది వున్నారు అందరికి లైఫ్ జాకెట్స్ ఉన్నాయో లేదో తదితర వివరాలు అందజేస్తారు. ఆ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసే తీరిక కూడా ఈ పోలీస్ స్టేషన్ వారికి ఉండదు. లంచాలకు అలవాటు పడిన ఇక్కడి స్టేషన్ సంతకం చేసి ముద్ర వేసి బోటు నిర్వాహకుడి చేతిలో పెట్టడం షరా మామూలే.
దేవీపట్నం దాటితే …
ఆ తరువాత నుంచి ప్రయాణం సాగేది ప్రమాదకర ప్రాంతం. దేవీపట్నం దాటిన తరువాత సెల్ ఫోన్ సిగ్నల్స్ బంద్ అయిపోతాయి. పాపికొండలు వెళ్ళి తిరిగి వచ్చేవరకు కమ్యూనికేషన్ వ్యవస్థ పర్యాటకులకు ఉండదు. మధ్యలో ఎలాంటి ప్రమాదం జరిగినా దిక్కు మొక్కు ఉండదు. కాసులకు కక్కుర్తి పడి సాగే టూరిజం బోటు యజమానులు ఒక మాఫియా గా అవతరించింది. దాంతో అనుమతులు నిబంధనలు అన్ని గోదారిలో కలిపేస్తారు వీరు.
నిద్రపోతున్న పర్యాటక శాఖ ….
ఎపి పర్యాటక శాఖకు ఎంతో ఆదాయం తెచ్చి పెట్టే అవకాశం వున్న పాపికొండల పై ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా చేసేది ఏమి లేదు. పటిష్ట రక్షణ చర్యలు చేపట్టి అధిక ఆదాయం తెచ్చే సరైన కార్యాచరణ పర్యాటక శాఖ తీసుకోదు. ప్రభుత్వమే బోటు లు నిర్వహిస్తే కొంతవరకు ప్రమాదాల నియంత్రణకు అవకాశం లభిస్తుంది. అయితే ఆ దిశగా కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు.
ప్రభుత్వం ఎవరిదైనా వారిదే హవా ….
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నాయకులు బోటు అసోసియేషన్ లో చక్రం తిప్పేలా ఈ వ్యవహారం నడుస్తుంది. నదీ విహారయాత్రల్లో విదేశీలలో అనుసరించే మార్గాలను అధ్యయనం చేసి ఏ ప్రభుత్వం అలాంటి నిబంధనలుచిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. ప్రమాదకర పరిస్థితుల్లో బోటులు విచ్చలవిడిగా తిరుగుతున్నా పట్టించుకోని యంత్రాంగం అనుకోని సంఘటన జరిగితే నష్టపరిహారం ప్రకటించడంలో మాత్రం అత్యంత వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అదే తీరు లో సాగింది. ప్రస్తుతం వైసిపి సర్కార్ వచ్చి మూడు నెలలే అయినా ఈ ప్రభుత్వం అదే ధోరణి లో సాగడం విమర్శలకు తెరతీసేలా వుంది.