గౌరమ్మా…నీకిది తగునమ్మా…??
కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతలు ఉన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి [more]
కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతలు ఉన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి [more]
కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతలు ఉన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌరు వెంకట్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే వారు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ మేరకు టీడీపీ నేతలతో వారు చర్చలు జరిపి పాణ్యం టిక్కెట్ పై హామీ పొందారు. అదే టిక్కెట్ కోసం జగన్ వద్ద నుంచి హామీ దక్కకపోవడం వల్లే గౌరు దంపతులు వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. వారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పాణ్యం నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయమైంది.
కాటసాని చేరికతో…
వైఎస్ కుటుంబానికి గౌరు దంపతులు మొదటి నుంచి దగ్గరగా ఉన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక జైలుకెళ్లి మరీ గౌరు వెంకట్ రెడ్డిని కలిసివచ్చారు. ఇది అప్పట్లో పెద్ద వివాదాస్పదం అయ్యింది. వైఎస్ మృతి తర్వాత కూడా గౌరు దంపతులు జగన్ వెంట నడిచారు. వైసీపీకి కర్నూలు జిల్లాలో కీలక నేతలుగా ఉన్నారు. గౌరు వెంకట్ రెడ్డి రెండుసార్లు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పాణ్యం నుచి చరితకు టిక్కెట్ ఇవ్వగా ఆమె స్వతంత్ర అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. ఇక, గౌరు వెంకట్ రెడ్డిని కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడితే గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో గౌరు దంపతుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.
పాణ్యం టిక్కెట్ ఖాయం..!
అయితే, పాణ్యంలో బలమైన నేత, ఐదుసార్లు గెలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏడాది క్రితం వైసీపీలో చేరారు. ఆయన గతసారి స్వతంత్ర అభ్యర్థిగానే 60 వేలకు పైగా ఓట్లు సాధించారు. దీంతో పాణ్యంలో ఆయనను నిలబెడితే కచ్చితంగా విజయం సాధించవచ్చని వైసీపీ భావిస్తోంది. కాటసాని చేరిన నాటి నుంచి పాణ్యం వైసీపీ రెండు వర్గాలుగా తయారైంది. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. ఇక, ఎన్నికలు సమీపిస్తున్న జగన్.. గౌరు చరితకు పాణ్యం టిక్కెట్ పై ఎటువంటి హామీ ఇవ్వలేదు. టిక్కెట్ కాటసానికే ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. దీంతో గౌరు దంపతులు అసంతృప్తితో ఉన్నారు. వీరిని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుజ్జగించారు. పార్టీలో నిబద్ధతగా ఉన్నందున జగన్ న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. అయినా పాణ్యం నుంచి కచ్చితంగా పోటీ చేయాల్సిందే అని భావిస్తున్న గౌరు దంపతులు వైసీపీకి గూడ్ బై చెబుతున్నారు. పాణ్యంలో టీడీపీకి సరైన అభ్యర్థి లేరు. దీంతో టీడీపీ వీరికి టిక్కెట్ ఖరారు చేసింది. వీరు టీడీపీలోకి వెళ్లడం ద్వారా ఆ పార్టీకి అదనపు బలం చేకూరడంతో పాటు వైసీపీకి రాజకీయంగా, నైతికంగానూ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుంది.