ఆజాద్ మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నమేనా?
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయనకు నలభై ఏళ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉంది. అంత సులువుగా తెంచుకోలేని పరిస్థితి ఆజాద్ ది. [more]
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయనకు నలభై ఏళ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉంది. అంత సులువుగా తెంచుకోలేని పరిస్థితి ఆజాద్ ది. [more]
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయనకు నలభై ఏళ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉంది. అంత సులువుగా తెంచుకోలేని పరిస్థితి ఆజాద్ ది. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయన కీలక పదవులు అనుభవించారు. అయితే రెండుసార్లు వరసగా కాంగ్రెస్ ఓటమిపాలు కావడంతో సీనియర్ నేతగా గులాం నబీ ఆజాద్ చేసిన సూచనలను అధిష్టానం తప్పుగా అర్థం చేసుకుందంటున్నారు.
స్వరం మార్చి….
గులాంనబీ ఆజాద్ నేతృత్వంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాయడం ఇటీవల చర్చనీయాంశమైంది. అయితే తాము పార్టీ బలోపేతం కోసమే సూచనలు చేశామని చెప్పినా, గులాం నబీ ఆజాద్ ను పార్టీ అధిష్టానం దూరంగా పెట్టింది. ఆయనకు చెక్ పెట్టే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇక బీహార్ ఎన్నికల తర్వాత గులాం నబీ ఆజాత్ తన స్వరం మార్చినట్లు కనపడుతుంది. కపిల్ సిబాల్ అభిప్రాయంతో తాను విభేదిస్తున్నట్లు ఆజాద్ పేర్కొన్నారు.
పెద్ద దుమారమే…
గులాం నబీ ఆజాద్ నాయకత్వ విషయంలో రాసిన లేఖ పార్టీలో పెద్ద దుమారమే లేపింది. ఆయన బీజేపీ లో చేరేందుకే ఇలా లేఖ రాశారన్న విమర్శలు కూడా విన్పించాయి. కానీ గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాశ్మీర్ లో జరుగుతున్న పరిణామాల విషయంలోనూ గులాం నబీ ఆజాద్ కూడా పెద్ద స్పందించడం లేదు. అయితే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత ఆయన తొలిసారి ఇటీవల మాట్లాడారు.
అధిష్టానాన్ని వెనకేసుకొస్తూ….
కానీ ఓటములకు అధిష్టానాన్నిగులాం నబీ ఆజాద్ నిందించ లేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు. దీనికి నాయకత్వాన్ని నిందించి ప్రయోజనం లేదని గులాం నబీ ఆజాద్ చెప్పారు. నాయకులను మారిస్తే బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటని ఆజాద్ అనడం ఆయన క్రమంగా అధిష్టానం పట్ల స్వరం మారుస్తున్నట్లే అర్థమవుతోంది. తిరిగి పార్టీలో అధినాయకత్వానికి దగ్గరవ్వాలని ఆజాద్ ప్రయత్నిస్లున్నట్లే కనపడుతుంది.