మంత్రిగారు వేటు నుంచి తప్పించుకున్నట్లేనా?
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక మాట చెప్పారు. అవినీతిని సహించనన్నారు. ఎంతటి వారైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని తొలి శాసనసభ పక్ష సమావేశంలోనే జగన్ [more]
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక మాట చెప్పారు. అవినీతిని సహించనన్నారు. ఎంతటి వారైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని తొలి శాసనసభ పక్ష సమావేశంలోనే జగన్ [more]
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక మాట చెప్పారు. అవినీతిని సహించనన్నారు. ఎంతటి వారైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని తొలి శాసనసభ పక్ష సమావేశంలోనే జగన్ హెచ్చరించారు. అయితే పదిహేను నెలల కాలంలో మంత్రులపై పెద్దగా అవినీతి ఆరోపణలు రాలేదు. కానీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా ఆయన కుటుంబానికి ఈఎస్ఐ స్కాంలో ఉన్న నిందితుడితో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.
తీవ్ర ఆరోపణలు…..
గుమ్మనూరి జయరాం కుమారుడు ఈఎస్ఐ స్కాం నిందితుడి నుంచి బెంజికారు బహుమానంగా పొందినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు బయటపెట్టారు. మరో అడుగు ముందుకేసి ఆయన ఆధారాలను ఏసీబీ ఉన్నతాధికారులకు కూడా అందించారు. అయితే బెంజికారు తమది కాదని గుమ్మనూరి జయరాం వాదించినా, ఆయన కుమారుడు ఈఎస్ఐ స్కాంలో ఉన్న నిందితుడితో ఉన్న సంబంధాలు మాత్రం వాస్తవమేనని ఆయన సయితం అంగీకరించారు.
నివేదికలు అదే చెప్పినా…..
ముఖ్యమంత్రి జగన్ గుమ్మనూరి జయరాంపై వస్తున్న ఆరోపణలపై ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం తెప్పించుకున్నట్లు తెలిసింది. ఇందులో గుమ్మనూరి జయరాం కుటుంబ సభ్యులు ప్రమేయం ఉన్నట్లు తేలింది. అయినా జగన్ మంత్రి గుమ్మనూరి జయరాంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సీఎంఓ అధికారులు కూడా గుమ్మనూరి జయరాంపై వచ్చిన ఆరోపణలపై ప్రత్యేకంగా సమాచారం తెప్పించుకుని జగన్ కు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
విపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని…..
అయితే అన్ని నివేదికలు మంత్రి గుమ్మనూరి జయరాంకు వ్యతిరేకంగా ఉండటంతో జగన్ చర్యలు తీసుకుంటారని భావించారు. ఈ నివేదికలు పార్టీ నేతలకు లీక్ కావడంతో చర్చ మొదలయింది. అయితే జగన్ మాత్రం ఇప్పుడు మంత్రి గుమ్మనూరి జయరాంపై చర్యలు తీసుకుంటే విపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. పైగా జయరాంపై ఆరోపణల తీవ్రత కూడా తగ్గడంతో ఇప్పుడప్పుడే చర్యలు జగన్ తీసుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద మంత్రి గుమ్మనూరి జయరాం ప్రస్తుతానికి వేటు నుంచి తప్పించుకున్నట్లేనని అంటున్నారు.