షేక్ అయిపోతోంది… వైరస్ వేగంగా రీచ్ అవుతోంది
గుంటూరు నగరం కరోనా వైరైస్ తో షేక్ అయిపోతోంది. రాజధానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో అధికారులు ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటీకీ ఫలితం శూన్యంగానే కనిపిస్తుంది. [more]
గుంటూరు నగరం కరోనా వైరైస్ తో షేక్ అయిపోతోంది. రాజధానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో అధికారులు ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటీకీ ఫలితం శూన్యంగానే కనిపిస్తుంది. [more]
గుంటూరు నగరం కరోనా వైరైస్ తో షేక్ అయిపోతోంది. రాజధానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో అధికారులు ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటీకీ ఫలితం శూన్యంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందండం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయిన జిల్లాగా గుంటూరు గుర్తింపు పొందింది. గుంటూరులో అత్యధికంగా 109 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అత్యధిక కేసులతో…..
ిఇప్పటికే గుంటూరు జిల్లాలో 109కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా వైరస్ కారణంగా ఏడుగురు మృతి చెందితే అందులో గుంటూరు జిల్లాకు చెందిన వారు ముగ్గురున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారి తర్వాతే గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాంటాక్టు కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
రెడ్ జోన్లను గుర్తించి…..
అధికారులు ఇప్పటికే గుంటూరు జిల్లాలో రెడ్ జోన్లను గుర్తించారు. గుంటూరు సరిహద్దులన్నీ మూసి వేశారు. కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ స్థానంలో అనధికార కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. నిత్యావసర వస్తువులు, మందులను నేరుగా ఇంటివద్దకే డెలివరీ చేసే సదుపాయాన్ని కల్పించారు. ఎవరూ బయటకు రావద్దని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గుంటూరు డేంజర్ జోన్ లోకి వెళ్లిందని, బయటకు వస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నా…..
ప్రభుత్వం కూడా గుంటూరు జిల్లాపై ప్రత్యేక దృష్లి పెట్టింది. వాలంటీర్ కు కూడా వైరస్ సోకడంతో ఆయన ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరిని కలిశారు? అన్నదానిపై ఆరా తీసి వారిని కూడా క్వారంటైన్ కు తరలించారు. ఎన్ఆర్ఐ మెడికల్ కళశాల ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏ దుకాణాలను తెరుచుకోకుండా అధికారులు ఆంక్షలు విధించారు. నిత్యావసర సరుకులుకు కూడా రోజు మార్చి రోజు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం మీద గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ప్రజల సహకారాన్ని అధికారులు కోరుతున్నారు.