హరీశ్ అదే చేస్తారా…?
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు రాజకీయ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపించడం సాధారణమైంది. ఎన్నికలు అయ్యాక సీఎం కేసీఆర్ ఆయన్ను పూర్తిగా దూరం పెట్టారనే [more]
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు రాజకీయ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపించడం సాధారణమైంది. ఎన్నికలు అయ్యాక సీఎం కేసీఆర్ ఆయన్ను పూర్తిగా దూరం పెట్టారనే [more]
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు రాజకీయ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపించడం సాధారణమైంది. ఎన్నికలు అయ్యాక సీఎం కేసీఆర్ ఆయన్ను పూర్తిగా దూరం పెట్టారనే వార్తలు , విశ్లేషణలు అనేకం వచ్చాయి. అయితే తాజాగా హరీశ్‌రావుకు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మళ్లీ ప్రాధాన్యం దక్కుతుందనే ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలు, ఊహాగానాలేనని టీఆర్ఎస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఇంతకీ అసలు హరీశ్‌రావుకు పూర్వ వైభవం వస్తుందా.. రాదా ?అనేది ఆయన అభిమానులను తొలుస్తున్న ప్రశ్న.
చింతమడక సభతో….
మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత ఊరు చింతమడకలో ఆత్మీయ సమావేశం నిర్వహించినప్పుడు హరీశ్ రావు అన్నీతానై వ్యవహరించారు. చింత మడక హరీశ్ సొంత నియోజకవర్గం కావడంతో కార్యక్రమం మొత్తం నిర్వహణను తన భుజాలపై వేసుకున్నాడు. అయితే హరీశ్‌రావును మళ్లీ కేసీఆర్ దగ్గరకు తీశాడని, మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్‌తో పాటు హరీశ్‌కు బెర్త్ ఖాయమని ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఆయన అభిమానులు తెగ సంబరపడ్డారు.
ప్రాధాన్యత లేదా?
అటు కేటీఆర్‌కు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కదా ? అని ప్రశ్నించే వారు ఉన్నా… ఇప్పుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం మంత్రి పదవి లేకపోయినా అన్ని శాఖల్లోనూ ఆయన హవా నడుస్తుందన్న టాక్ ఉండనే ఉంది. కానీ హరీశ్‌రావుకు అలా లేదు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ రాష్ఠ్రంలోని కలెక్టర్లందరినీ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌కు ఆహ్వానించాడు. నియోజకవర్గంలోని కోమటిబండలో అటవీ పెంపకం స్పాట్ ను వారికి చూపించారు.
అందరూ ఉన్నా…..
ఈ కార్యక్రమంలో కలెక్టర్లతోపాటు జిల్లాలోని ముఖ్యమైన పాలనాధారులు, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. అంతేగాక సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయి, టీఆర్ఎస్లో చేరిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు. అసలు ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ప్రతాప్‌రెడ్డిని హ్యాండిల్ చేసింది హరీశే. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడా హరీశ్‌రావు కనిపించలేదు.
సస్పెన్స్ ను కొనసాగిస్తారా?
మొన్న ఎన్నికల సమయంలో కేసీఆర్ కోసం గజ్వేల్‌లో హరీశ్‌రావు ఎంతో కష్టపడ్డారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని ధీటుగా ఎదుర్కొని, సీఎం కేసీఆర్ కు భారీ మెజార్టీ రాబట్టగలిగారు. అయినప్పటికీ గజ్వేల్ లో సీఎం నిర్వహించిన కార్యక్రమానికి హరీశ్‌రావు కు హాజరుకాకపోవంతో రకరకాల ఊగాహానాలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇంతకీ అసలు సీఎం కేసీ ఆర్ మదిలో హరీశ్‌రావుపై ఎలాంటి అభిప్రాయం ఉంది… హరీశ్‌కు పార్టీలో, ప్రభుత్వంలో మళ్లీ తగిన ప్రాధాన్యత దక్కుతుందా ? అనేది ఇప్పుడు ఆయన అభిమానుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. మొత్తానికి ఈ సస్పెన్స్‌ను కేసీఆర్ ఎన్ని రోజులు నడిపిస్తారో ? చూడాలి.