Harish rao : రెండో ఓటమి.. హరీశ్ కు జింతాక్.. జింతాక్
టీఆర్ఎస్ లో హరీశ్ రావుది కేటీఆర్ తర్వాత స్థానం అంటారు. ఆయనను ట్రబుల్ షూటర్ గా పార్టీలో పిలుచుకుంటారు. పార్టీలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా హరీశ్ రావు [more]
టీఆర్ఎస్ లో హరీశ్ రావుది కేటీఆర్ తర్వాత స్థానం అంటారు. ఆయనను ట్రబుల్ షూటర్ గా పార్టీలో పిలుచుకుంటారు. పార్టీలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా హరీశ్ రావు [more]
టీఆర్ఎస్ లో హరీశ్ రావుది కేటీఆర్ తర్వాత స్థానం అంటారు. ఆయనను ట్రబుల్ షూటర్ గా పార్టీలో పిలుచుకుంటారు. పార్టీలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా హరీశ్ రావు సునిశితంగా పరిష్కరిస్తారంటారు. అంతేకాదు ఉప ఎన్నికల్లోనూ ఆయన వ్యూహాలు వేరుగా ఉంటాయని, అక్కడకు హరీశ్ రావు వెళితే టీఆర్ఎస్ గెలుపు ఖాయమని భావిస్తారు. ఇప్పుడు వరసగా హరీశ్ రావు బాధ్యత వహించిన రెండు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడి పార్టీలో హరీశ్ రావు క్రేజ్ ను తగ్గించిందనే చెప్పాలి.
మరోసారి….
హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ హరీశ్ రావు ను మరోసారి రంగంలోకి దించారు. దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి పాలయినా హరీశ్ పై నమ్మకంతోనే కేసీఆర్ ఈ బాధ్యతలను కూడా అప్పగించారు. కానీ ఇప్పుడు కూడా ఓటమి పాలు కావడంతో పార్టీలో హరీశ్ రావుపై భవిష్యత్ పై చర్చ జరుగుతోంది. హరీశ్ రావును పక్కన పెడతారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది.
అన్నీ తెలిసినా…
ట్రబుల్ షూటర్.. బాహుబలి… ఇవీ హరీశ్ రావుకు ఇచ్చిన బిరుదులు. తనకు హుజూరాబాద్ బాధ్యతలను అప్పగించినప్పుడే హరీశ్ రావుకు తెలుసు. ఇక్కడ గెలుపు అంతసులువు కాదని. ఈటలను బయటకు పంపిన తీరే అందుకు కారణం. కానీ హరీశ్ రావు తన శక్తికి మించి పోరాడారు. వందల కోట్లను ఖర్చు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రవేశ పెట్టారు. హరీశ్ రావు నిద్రాహారాలు లేకుండా నియోజకవర్గంలో పర్యటించారు. ఎక్కడ పది ఓట్లు ఉన్నాయంటే అక్కడకు వెళ్లి సమావేశం పెట్టేవారు. అయినా ఈటల పై పనిచేసిని సానుభూతి ముందు హరీశ్ రావు శ్రమ వృధా అయిందనే చెప్పాలి.
ఈటల సానుభూతి ముందు….
ఈటల రాజేందర్ బలం, బలహీనతలపై హరీశ్ రావు కు సంపూర్ణ అవగాహన ఉండటంతోనే ఆయనను కేసీఆర్ హుజూరాబాద్ కు పంపారు. ఆయన గుటమట్టులన్నీ తెలిసిన నేత. నిజానికి హరీశ్ రావు దుబ్బాక ఫలితం తర్వాత కొంత డీలా పడ్డారు. హుజూరాబాద్ తనను తాను నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించారు. కానీ రిజల్ట్ రివర్స్ అయింది. ఈటల ముందు హరీశ్ రావు తలదించాల్సి వచ్చింది. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గే అవకాశాలు లేకపోలేదు. మరోసారి హరీశ్ రావుకు అవకాశం ఇచ్చే సాహసాన్ని కేసీఆర్ చేయరు అంటున్నారు. మొత్తం మీద హరీశ్ రావు హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బలిపశువుగా మారారన్న టాక్ వినపడుతుంది.