హరీశ్ బాధ్యత వహించాల్సిందేనా?
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఊహించని అపజయం ఎదురయింది. ఇది టీఆర్ఎస్ ఓటమి అయినా వ్యక్తిగతంగా హరీశ్ రావుకు ఓటమి అని [more]
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఊహించని అపజయం ఎదురయింది. ఇది టీఆర్ఎస్ ఓటమి అయినా వ్యక్తిగతంగా హరీశ్ రావుకు ఓటమి అని [more]
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఊహించని అపజయం ఎదురయింది. ఇది టీఆర్ఎస్ ఓటమి అయినా వ్యక్తిగతంగా హరీశ్ రావుకు ఓటమి అని చెప్పక తప్పదు. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హరీశ్ రావు రాజీనామా చేస్తారన్న టాక్ గులాబీ పార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం.
ట్రబుల్ షూటర్ గా…..
హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిలో ట్రబుల్ షూటర్ గా పేరుంది. అలాగే ఉప ఎన్నికల ఎక్స్ పెర్ట్ గా కూడా హరీశ్ రావుకు పేరుంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలనే ఉప ఎన్నికల్లో గెలిపించిన ఘనత హరీశ్ రావుది. అలాంటి హరీశ్ రావు తన సొంత జిల్లాలో, తన నియోజకవర్గానికి పక్కనే ఉన్న దుబ్బాకలో పార్టీని విజయం వైపు నడిపించడంలో విఫలమయ్యారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.
పూర్తి బాధ్యతలను…..
దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా హరీశ్ రావుకే అప్పగించారు. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే అని చెప్పుకోవాలి. నాలుగు సార్లు విజయం సాధించిన సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణికే సీటు ఇచ్చారు. దుబ్బాక నియోజవర్గం హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్ లు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లను ఆనుకునే ఉండటంతో గెలుపు ఈజీ అనుకున్నారు.
అతివిశ్వాసమే ….?
దీంతో టీఆర్ఎస్ నేతల అతి విశ్వాసం కొంప ముంచిందంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు తప్ప ఏ మంత్రి ప్రచారంలో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం ప్రచారానికి దూరంగా ఉన్నారు. హరీశ్ రావుకు చెక్ పెట్టేందుకే అందరూ ప్రచారానికి దూరంగా ఉన్నారన్న కామెంట్స్ గతంలోనే విన్పించాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి హరీశ్ రావు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.