హరీశ్ పైనే అంతా బాధ్యత.. ట్రబుల్ షూటర్ కే?
దుబ్బాక ఉప ఎన్నికకు అంతా సిద్ధమయింది. ఎన్నిక కోసం అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటికే దుబ్బాకలో ప్రచారాన్ని అందరూ మొదలుపెట్టారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి [more]
దుబ్బాక ఉప ఎన్నికకు అంతా సిద్ధమయింది. ఎన్నిక కోసం అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటికే దుబ్బాకలో ప్రచారాన్ని అందరూ మొదలుపెట్టారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి [more]
దుబ్బాక ఉప ఎన్నికకు అంతా సిద్ధమయింది. ఎన్నిక కోసం అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటికే దుబ్బాకలో ప్రచారాన్ని అందరూ మొదలుపెట్టారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి అభ్యర్థిని ప్రకటించకున్నా గ్రామస్థాయిలో నేతలను నియమించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామచంద్రారెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఆయన కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ను టీఆర్ఎస్ ఇవ్వనుంది.
ఇన్ ఛార్జిగా…..
ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇన్ ఛార్జిగా హరీశ్ రావును పార్టీ అధిష్టానం నియమించింది. హరీశ్ రావు దుబ్బాక నియోజకరవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ఇన్ ఛార్జులను టీఆర్ఎస్ నియమించింది. ఒక్కొక్క గ్రామానికి ఇన్ ఛార్జిని నియమించి వారికే పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఓటర్లను ఆకట్టుకోవడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చేంత వరకూ వారిదే బాధ్యత.
గ్రామాల వారీగా…..
ిఇక గ్రామాల్లో సమస్యలను ఏవి ఉన్నాయో గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే కొన్నింటిని పూర్తి చేసింది. పెద్ద సమస్యలయితే తామే పరిష్కరిస్తామని, ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి గతంలో ఇచ్చిన హామీలను కూడా తాము దగ్గరుండి అమలు చేస్తామని హరీశ్ రావు స్వయంగా ప్రజలకు చెబుతున్నారు. నియోజకవర్గాన్ని మరో సిద్ధిపేట చేస్తానని హరీశ్ రావు దుబ్బాక ప్రజలకు హామీ ఇస్తున్నారు.
మెజారిటీపైనే…
ఉప ఎన్నికల్లో పార్టీకి విజయం సాధించిపెట్టడంలో దిట్ట అయిన హరీశ్ రావు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు ఒక్కటే కాదని, మెజారిటీ ముఖ్యమని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని హరీశ్ క్యాడర్ కు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను పోటీకి నిలబెడుతుండటంతో ఈ ఎన్నికను హరీశ్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మెజారిటీ మీదనే హరీశ్ రావు దృష్టి సారించారు. ఏభాధ్యతను అప్పగించినా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసే హరీశ్ రావు ఉప ఎన్నికలో కూడా విజయం సాధించిపెడతారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.