బాబాయి కోసం అబ్బాయి బుక్ అయ్యాడే …?
రామ్ పోతినేని ఆకస్మికంగా వార్తల్లోకి ఎక్కారు. తన సినిమాలు తప్ప పెద్దగా వివాదాల్లో ఎప్పుడు హీరో రామ్ తలదూర్చలేదు. చాలా కాలం హిట్స్ లేక అల్లాడుతున్న రామ్ [more]
రామ్ పోతినేని ఆకస్మికంగా వార్తల్లోకి ఎక్కారు. తన సినిమాలు తప్ప పెద్దగా వివాదాల్లో ఎప్పుడు హీరో రామ్ తలదూర్చలేదు. చాలా కాలం హిట్స్ లేక అల్లాడుతున్న రామ్ [more]
రామ్ పోతినేని ఆకస్మికంగా వార్తల్లోకి ఎక్కారు. తన సినిమాలు తప్ప పెద్దగా వివాదాల్లో ఎప్పుడు హీరో రామ్ తలదూర్చలేదు. చాలా కాలం హిట్స్ లేక అల్లాడుతున్న రామ్ కి కరోనా కి ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడం తో మరిన్ని సినిమా ఛాన్స్ లు దక్కాయి. కరోనా లేకపోతే రెడ్ చిత్రం ద్వారా ఈపాటికి థియేటర్లలో రామ్ రీ ఎంట్రీ ఇచ్చేవారు. ఇలా సాఫీగా సాగుతున్న రామ్ సినీ జీవితం లో ఇప్పుడు ఆయన తాజాగా చేసిన ట్వీట్స్ విమర్శల పాలు చేశాయి. అభిమానులు సైతం రామ్ పై సోషల్ మీడియా లో దుమ్మెత్తి పోసేస్తున్నారు.
రమేష్ ఆసుపత్రి తీరును సమర్ధించడంతో …
విజయవాడలో జరిగిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ దుర్ఘటన లో రమేష్ ఆసుపత్రి చేసిన తప్పులు ఇప్పుడు విచారణలో పూర్తిగా బయటపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పదిమంది ఆసుపత్రి నిర్లక్ష్యంతో కన్ను మూసారు కూడా. దాంతో రమేష్ ఆసుపత్రి అధినేత రమేష్ చౌదరి పరారు అయ్యారు. కోర్ట్ ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ కి సైతం ఆయన ప్రయత్నాలు సైతం చేసుకుంటున్నారు. అది అలా ఉండగా రమేష్ తన సొంత బాబాయి కావడంతో తప్పంతా ప్రభుత్వానిదే అన్న రీతిన వరుస ట్వీట్ల తో బాటు వైఎస్ జగన్ పై పలు ప్రశ్నలు సంధించారు రామ్. రమేష్ తనకు స్ఫూర్తి అని అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడమేమిటి అన్నట్లు ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు.
విరుచుకుపడిన నెటిజెనం …
హీరో రామ్ రమేష్ ఆసుపత్రికి మద్దతుగా ఇలా ట్విట్టర్ లో దాడి మొదలు పెట్టడంతో నెటిజెన్స్ ఎదురు దాడి మొదలు పెట్టారు. రామ్ ను తిట్టిన తిట్లు తిట్టకుండా హోరెత్తించేస్తున్నారు. సాధారణ నెటిజెన్స్ కి తోడు వైసిపి అభిమానులు వైఎస్ జగన్ ఫ్యాన్స్ తోడైయ్యారు. అగ్నికి వాయువు తోడైనట్లు వీరంతా రామ్ కి ముచ్చెమటలు పట్టేలా కడిగేస్తున్నారు. తప్పు చేయకపోతే మీ బాబాయ్ ఎందుకు పారిపోయారని నిలదీస్తున్నారు. పదిమంది చనిపోయినా ధన దాహంతో రమేష్ ఆసుపత్రి ని సమర్ధిస్తున్న మీకు ఆ పాపంలో భాగం ఉండే ఉంటుందని ఆరోపించారు. ఇలా ఒక్కొక్కరు రామ్ పై టన్నుల కొద్ది రీ ట్వీట్ లు చేయడంతో ఇస్మార్ట్ అడ్డంగా ట్రోల్ అయిపోతున్నాడు. ఈ వార్ ఇప్పట్లో చల్లారేలా కూడా లేదు మరి.