మరికొంతకాలం భరించాలా? తప్పదట
లాక్ డౌన్ ప్రకటించడం ఎంత కష్టమో, అది ఎత్తివేయడం అంతే కష్టం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే ఇప్పుడు సవాల్ విసురుతుంది. పూర్తిగా ఎత్తేస్తే ప్రజల [more]
లాక్ డౌన్ ప్రకటించడం ఎంత కష్టమో, అది ఎత్తివేయడం అంతే కష్టం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే ఇప్పుడు సవాల్ విసురుతుంది. పూర్తిగా ఎత్తేస్తే ప్రజల [more]
లాక్ డౌన్ ప్రకటించడం ఎంత కష్టమో, అది ఎత్తివేయడం అంతే కష్టం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే ఇప్పుడు సవాల్ విసురుతుంది. పూర్తిగా ఎత్తేస్తే ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అనే విమర్శలను ప్రభుత్వాలు ఎదుర్కొంటాయి. పోనీ కొనసాగిస్తే ఆర్ధికవ్యవస్థ మరింత దిగజారి ఆకలి చావులతో పేదలు ప్రాణాలు వదిలే పరిస్థితి. దాంతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది కేంద్ర ప్రభుత్వం తీరు. దాంతో ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. అందులో ఉత్తమమైన మార్గాలు మనదేశంలో ఏమిటి అన్న అంశంపైనే సర్కార్ మల్లగుల్లాలు పడుతుంది.
ఆంక్షలు సడలిస్తూ …
ప్రస్తుతం ఉన్న స్థితిలో దేశంలో లాక్ డౌన్ కొనసాగింపు తప్పదన్నది వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయం. అలాగే వివిధ వర్గాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. మరో పక్క లాక్ డౌన్ లో కొన్ని వర్గాలపై ఆంక్షలు ఇస్తూ లాక్ డౌన్ కొనసాగించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ దిశగానే కేంద్రం అడుగులు కూడా పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రాల నడుమ వలసకూలీల తరలింపు అనే ప్రక్రియకు, యాత్రికులు, పర్యాటకులకు విద్యార్థులకు సొంత గూటికి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కేంద్రం.
మే 3న మరికొన్ని…..
ఇదే రీతిలో మే 3 వ తేదీన మరికొన్ని ఆంక్షలు ఎత్తివేస్తూ ఆర్ధిక వ్యవస్థను మోడీ గాడిన పెట్టె ప్రయత్నం మరికొంత ఎక్కువ చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు చెప్పక చెబుతున్నాయి. వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ తప్పదన్నది కేంద్రమంత్రి ఇప్పటికే స్పష్టం చేసేశారు. గ్రీన్ జోన్ లలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. మొత్తం మీద కేంద్రం అడుగులు లాక్ డౌన్ వైపే పడతాయని తేలిపోతుంది.