ఖర్చు మామూలుగా లేదుగా?
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి ఇప్పటి నుంచే మొదలయింది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాని నేతలకు మాత్రం చేతి చమురు బాగానే వదులుతుంది. హుజూరాబాద్ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి ఇప్పటి నుంచే మొదలయింది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాని నేతలకు మాత్రం చేతి చమురు బాగానే వదులుతుంది. హుజూరాబాద్ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి ఇప్పటి నుంచే మొదలయింది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాని నేతలకు మాత్రం చేతి చమురు బాగానే వదులుతుంది. హుజూరాబాద్ లో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనపుడుతుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించడంతో హుజూరాబాద్ రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, దానిని స్పీకర్ వెంటనే ఆమోదించడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖాయమైంది.
చాలా సమయం ఉన్నా….
అయితే ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. కోవిడ్ కారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈనేపథ్యంలో హుజూరాబాద్ ఎన్నికకు మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగారు. ఆయన గ్రామ గ్రామ ప్రచారాన్ని ప్రారంభించారు. తన క్యాడర్ జారిపోకుండా, ఓట బ్యాంకు మరలి పోకుండా ఆయన ఇప్పటి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ మండలాల వారీగా బాధ్యులను కూడా నియమించింది.
గెలుచుకుని తీరాలని…..
ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. హుజూరాబాద్ ను గెలుచుకుని తీరాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ ది. ఇప్టటికే మండాలనికి ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్ చార్జులుగా ఉన్నారు. ముఖ్యమైన కార్యకర్తలు, నేతలతో సమావేశం అవుతున్నారు. సమస్యలను కొన్నింటిని అక్కడకక్కడే పరిష్కరిస్తున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. గులాబీ జెండాలతో గ్రామ గ్రామాన ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలను….
కాంగ్రెస్, ఈటలను టార్గెట్ చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ లో ఎన్నికల వ్యూహాలను అమలు పరుస్తుంది. కాంగ్రెస్ నేతలను కూడా పార్టీలో చేర్చుకుంటుంది. కాంగ్రెస్ కూడా తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమయింది. ఇంకా ఎన్నిక కోసం కమిటీ, బాధ్యులను నియమించకపోయినా కాంగ్రెస్ నేతలు మాత్రం హుజూరాబాద్ ను చుట్టివస్తున్నారు. మొత్తం మీద హుజూరాబాద్ లో ఎన్నికల వేడి ఇప్పటినుంచే మొదలయింది. దీంతో నేతలకు, పార్టీలకు ఖర్చు తడిసి మోపెడంత అవుతుంది.