Sat Dec 21 2024 16:49:42 GMT+0000 (Coordinated Universal Time)
IIT గౌహతి, IIT మండి, CSTEP బెంగళూరు భారతదేశంలోని జిల్లా స్థాయి వాతావరణ ప్రమాద అంచనా నివేదికను విడుదల చేశాయి
భారతదేశ వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. విపరీతమైన వేడిగాలులు, అస్థిరమైన రుతుపవనాలు, పెరుగుతున్న కరువు,
భారతదేశ వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. విపరీతమైన వేడిగాలులు, అస్థిరమైన రుతుపవనాలు, పెరుగుతున్న కరువు, హిమాలయాలలో మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, వ్యవసాయం, నీటి కొరత వంటివి, ఈ దేశ ఆహార భద్రతపై ప్రభావం చూపిస్తోంది. ఈ వాతావరణ మార్పులు ఎన్నో సవాళ్లకు కారణం అవుతున్నాయి.
సవాళ్లపై పోరాటానికి సమిష్టి కృషి అవసరం:
వాతావరణ సవాళ్లపై పోరాడడానికి సమిష్టి కృషి అవసరం. వాతావరణ మార్పుల సవాళ్లను పరిష్కరించడానికి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి, ఐఐటి మండి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP), బెంగళూరు సహకారంతో “District-Level Climate Risk Assessment for India: Mapping Flood and Drought Risks Using IPCC Framework” అంటూ డిసెంబర్ 13న, 2024న ఒక నివేదికను విడుదల చేసింది. జిల్లా స్థాయిలో వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయి, వాటి వల్ల ఏర్పడే ప్రమాదాలకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసారు. IPCC ఫ్రేమ్‌వర్క్‌ని ఉపయోగించి వరద, కరువు ప్రమాదాలను మ్యాపింగ్ చేయడంపై కూడా వారు దృష్టి సారించారు.
ఐఐటి గౌహతి, ఐఐటి మండి, సిఎస్టీపి కి చెందిన విశిష్ట ప్రముఖులు ఈ నివేదికను ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST), భారత ప్రభుత్వం, స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ (SDC), స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం మద్దతుతో భారతదేశంలో జిల్లా స్థాయి వాతావరణ ప్రమాదాల గురించి వివరణాత్మక విశ్లేషణను ఈ నివేదిక అందిస్తుంది.
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించి చేసిన అధ్యయనం ద్వారా వరదలు, కరువుల వల్ల ఎదురయ్యే సవాళ్లను గుర్తించవచ్చు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి ఉపయోగించాల్సిన వ్యూహాల తక్షణ అవసరాన్ని కూడా పరిశోధనలు నొక్కివక్కానిస్తున్నాయి. ఈ నివేదిక జిల్లా స్థాయిలో వాతావరణ ప్రమాదాల వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది.
నివేదిక ఫలితాలు:
ఈ నివేదికలో పలు జిల్లాల్లో పొంచి ఉన్న ప్రమాదాల గురించి తెలుసుకోవచ్చు. అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, జమ్మూకశ్మీర్‌లలోని వరద ప్రమాదం ముప్పు 51 జిల్లాలలో అత్యంత తీవ్రంగా ఉంది. వీటిని "వెరీ హై" కేటగిరీలో ఉంచారు. ఇక 118 జిల్లాలు "హై" రిస్క్‌లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. కరువుకు సంబంధించి 91 జిల్లాలు "వెరీ హై" రిస్క్‌లో ఉన్నాయి. 188 జిల్లాలు "హై" రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ జిల్లాలు ప్రధానంగా బీహార్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలో ఉన్నాయి.
పాట్నా, అలప్పుజా, కేంద్రపారాతో సహా 11 జిల్లాలలో వరదలు, కరువులకు "వెరీ హై" ప్రమాదంలో ఉన్నాయి. ఈ అధ్యయనం జిల్లా స్థాయి ప్రమాదాల సమగ్ర వీక్షణను అందిస్తుంది. భారతదేశ విపత్తు ప్రమాదాన్ని తగ్గించే ఎజెండాకు అనుగుణంగా డేటా ఆధారిత ప్రణాళికకు మద్దతు ఇస్తుంది. ఈ అధ్యయనం వాతావరణ ప్రమాదాలు జిల్లా స్థాయి లో విశ్లేషణ ను అందిస్తుంది. వరదలు, కరువు వంటి వైపరిత్యాల నుంచి వచ్చే ప్రమదాలను గుర్తిస్తుంది. బలమీన సమాజాని నిర్మించడానికి, ప్రాంతాన్ని బట్టి చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతో ఉంది అని రీపోర్ట్ చెప్తుంది.
నిపుణుల విశ్లేషణ:
డీపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో సైంటిఫిక్ విభాగాల అధిపతి అనితా గుప్తా, తన స్పీచ్ లో “వాతావరణ మార్పు అనేది వ్యవసాయం, జీవనోపాధి, జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేయగలదు. ఇప్పటి కాలంలోని అత్యంత భయంకరమైన సవాళ్లలో ఇదీ ఒకటి. ఏ ఒక్క సంస్థ కూడా దీనిని పరిష్కరించలేదు, దీనికి సమిష్టి కృషి, వినూత్న ఫ్రేమ్‌వర్క్‌ల అవసరం ఉంది. ఈ నివేదిక ద్వారా, పొంచి ఉన్న ముప్పును గుర్తించడం, సున్నితత్వాన్ని అంచనా వేయడం, ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో ఒక ముఖ్యమైన అడుగు వేశాం." అని తెలిపారు.
"ఈ ఫలితాలను ఆన్-గ్రౌండ్ చర్యలలోకి తీసుకుని రావడం చాలా అవసరం. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో చర్యలు తీసుకోవాలి. భారతదేశం పరిశుభ్రమైన, పచ్చటి, వాతావరణ-స్థిరమైన భవిష్యత్తును సాధించడానికి సమతుల్య అనుసరణ, ఉపశమన వ్యూహంతో ముందుకు సాగుతుంది. 2047 నాటికి విక్షిత్ భారత్, నెట్ జీరో భారత్ కోసం మా లక్ష్యాలను వేగంగా ట్రాక్ చేస్తాము." అని తెలిపారు.
ఈ నివేదిక రాష్ట్ర స్థాయిలో సామర్థ్యాల పెంపుకు ప్రాముఖ్యతను చూపిస్తుంది, వాతావరణ మార్పును, సంబంధిత విభాగాలను సాధనాలు పద్ధతులతో రిస్క్ అసెస్మెంట్లను అనుసరణ ప్రణాళికలలోకి చేర్చడానికి సన్నద్ధం చేస్తుంది. అధ్యయనంలో భాగంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లు, శిక్షణా సెషన్లు రాష్ట్ర విభాగాలు, విద్యాసంస్థలు, స్థానిక ప్రజల మధ్య నాలెడ్జ్ నెట్‌వర్క్‌ను రూపొందించడంలో సహాయపడ్డాయి.
నిర్దిష్ట సవాళ్ళను ఎదుర్కోడానికి రోడ్‌మ్యాప్‌ను తీసుకుని వచ్చి, వాతావరణ సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి కమ్యూనిటీలను సర్వ సన్నద్ధం చేయడమే. అనుకున్న లక్ష్యాలను సమిష్టి కృష్టితోనే సాధ్యం చేసుకోవచ్చు. వాతావరణ సమస్యలను ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story