ఇమ్రాన్ పై కుట్ర తప్పదా?
పాకిస్ధాన్ రాజకీయాలను, సైన్యాన్ని వేరు చేసి చుాడలేం. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి పాలనపై సైన్యానికి పట్టు ఉండే మాట వాస్తవం. భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వాలు [more]
పాకిస్ధాన్ రాజకీయాలను, సైన్యాన్ని వేరు చేసి చుాడలేం. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి పాలనపై సైన్యానికి పట్టు ఉండే మాట వాస్తవం. భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వాలు [more]
పాకిస్ధాన్ రాజకీయాలను, సైన్యాన్ని వేరు చేసి చుాడలేం. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి పాలనపై సైన్యానికి పట్టు ఉండే మాట వాస్తవం. భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వాలు సైతం సైన్యాన్ని కాదని ముందుకు వెళ్ళే పరిస్ధితి లేదు. సైన్యం ప్రాధాన్యాన్ని అవి గుర్తించక తప్పదు. లేనట్లయితే ఏం జరుగుతుందో ఏడు దశాబ్దాల పాక్ ప్రస్ధానాన్ని పరిశీలిస్తే అర్ధమవుతుంది. పూర్తిస్ధాయి మెజారిటీ సాధించలేక చిన్నచితకా పార్టీల మద్దతుతో 2018 జులైలో అధికార పీఠాన్ని అధిష్టించిన ఒకప్పటి క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు ఈ విషయం మరింత సుస్పష్టంగా తెలుసు. ఇప్పుడు తన పీఠానికీ సైన్యం ఎసరు పెట్టబోతోందంటుా వస్తున్న వార్తలు పాకిస్ధాన్ తెహ్రిక్ – ఇ – ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేతను కలవరపెడుతున్నాయి.
అన్నీ వైఫల్యాలే…..
పాలనతోపాటు కరోనాను ఎదుర్కొవడంలో వైఫల్యాలు, ఆర్ధిక వ్యవస్ధగాడితప్పడం, అవినీతి, నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం. గతంలో మాదిరిగా అగ్రరాజ్యమైన పెద్దన్న అమెరికా సాయం కొరవడం, చైనాతో అంటకాగుతున్నప్పటికీ పెద్దగా ప్రయెాజనం చేకూరక పోవడం, ఇమ్రాన్ కు క్రమంగా ప్రజాదరణ తగ్గుతుండటం, తదితర అంశాలను సైన్యం గుర్తించింది. ఈ నేపద్యంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆర్మీపావులు కదుపుతుందన్న వార్తలు ఇటుపాలన కేంద్రమైన ఇస్లామాబాద్ లో అటు సైనిక కేంద్రమైన రావల్పిండి లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని తోసిపుచ్చలేని పరిస్ధితి కుాడా ఉంది. సైన్యం ప్రాధాన్యాన్ని గుర్తించిన ఇమ్రాన్ ఖాన్ అధికారం చేపట్టిన నాటి నుంచి దానిని ప్రసన్నం చేసే చర్యలు చేపట్టారు.
ఆయన పదవీకాలాన్ని…..
నవాజ్ షరీఫ్ హయాంలో 2016 నవంబరులో సైన్యాధిపతిగా నియమితులైన జనరల్ కమర్ జావెల్ బజ్వా పదవీ కాలాన్ని గత ఏడాది మరో ముాడేళ్ళకు అంటే 2022 వరకు పొడిగించారు. గతఏడాది కీలకమైన జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి దానికి జనరల్ బజ్వా సారద్యం వహిస్తారు. ప్రభాత్వ విధాన నిర్ణయాల్లో ఈ మండలి కీలకపాత్ర వహిస్తుంది. గత సైన్యాధిపతులు పరోక్షంగా పాలనలో కీలకపాత్ర పోషించేవారు. కానీ ఇప్పుడు జనరల్ బజ్వా పాత్ర అంతా బహిరంగమే. ఇమ్రాన్ ఖాన్ వరుస వైఫల్యాల నేపధ్యంలో ఆయనను పదవి నుంచి దించక తప్పదన్నది బజ్వా అభిప్రాయంగా కనపడుతోంది. కుట్రలతో ప్రభుత్వాలను పడగొట్టడం పాక్ సైన్యాధిపతులకు కొత్తఏమీలేదు. అదివారికి వెన్నతో పెట్టినవిద్య. ఇప్పటివరకు ముాడుసార్లు సైనిక కుట్రలు జరిగాయి.
సైనిక పాలన మామూలే…..
తొలుత 1958 లో జనరల్ ఆయుాబ్ ఖాన్ సైనికమంత్రి ద్వారా నాటి ప్రభుత్వాన్ని పడగొట్టారు. 10 సంవత్సరాలపాటు ఏకచక్రాధిపత్యంగా దేశాన్ని పాలించారు. 1977 లో పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ (PPP) కి చెందిన ప్రధాని జుల్ఫికర్ ఆలీభుట్టో ను అప్పటి ఆర్మీచీఫ్ జనరల్ జియావుల్ షక్ సైనిక కుట్ర ద్వారా తొలగించారు. 1999 లో నాటి ప్రధాని నవాజ్ షరీష్ ను అప్పటిసైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ పడగొట్టిన సంగతి ఇటీవలి చరిత్రే. పాక్ చరిత్రను పరిశీలిస్తే ఏ ఒక్న ప్రధానీ పూర్తి అయిదేళ్ళు అధికారంలో కొనసాగిన ధాఖలాలు లేవు. అందరుా అర్ధంతరంగా నిష్క్రమించిన వారే. దేశాధ్యక్షుడిపై వేటు వేయడంతో కొందరు సైన్యం కుట్రద్వారా, న్యాయస్ధానాల వేటు కారణంగా మరికొందరు పదవులనుంచి తప్పుకోవలసివచ్చింది. పంజాబ్ సింహంగా పేరొందిన నవాజ్ షరీఫ్ ముాడుసార్లు ప్రధాని పదవిని చేజిక్కించుకున్నప్పటికీ ఒక్కసారి సైతం పూర్తి పదవీకాలాన్ని పుార్తి చేయలేకపోయారు. 1993 లో మెుదటిసారి రాజకీయ కారణాలతో, 1999 లో నాటిసైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైనిక కుట్ర కారణంగా, 2017 లో అవినీతికేసులో సుంప్రీకోర్టు తీర్పు ఫలితంగా ప్రధాని పదవి నుంచి వైదొలగారు.
బలహీనంగా ఉండటంతో….
ప్రస్తుత పాక్ పరిస్ధితి దయనీయంగా ఉంది. ద్రవ్యోల్బణానికి పట్టపగ్గాలు ఉండటంలేదు. ఈ ఏడాది జనవరిలో 14.6 శాతం ద్రవ్యోల్బణం నమెాదైంది. మరో పక్క ద్రవ్యోల్బణాన్ని నివారించే ఉద్ధేశంతో అక్కడి రిజర్వ్ బ్యాంక్ చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. వడ్డీరేట్లను తగ్గించినా రుణాలను తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలు పెద్దగా ముందుకు రావటంలేదు. ఈ పరిస్ధితిని చక్కదిద్దాలంటే జోక్యం అనివార్యమన్నది పాక్ మిలటరీ అభిప్రాయంగా ఉంది. రాజకీయంగా కుాడా ఇమ్రాన్ ఖాన్ బలంగా లేరు. 2018 లో సొంతంగా మెజార్టీ సాధించలేక చిన్నచితకా పార్టీల మద్దతుతో సర్కారును ఏర్పాటు చేశారు. దేశంలో అతిపెద్ద ాప్రవిన్స్ అయిన పంజాబ్ లో నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్ధాన్ ముస్లి లీగ్ పాగా వేసింది. మరో కీలక ప్రావిన్స్ అయిన సింధ్ ను పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ కైవశం చేసుకుంది. ఒక్క ఖైబర్ ఫక్తూన్ క్వా ప్రావిన్స్ ను మాత్రమే ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేజిక్కించుకుంది. రాజకీయంగా ఇమ్రాన్ బలవంతుడు కాదన్న విషయాన్ని ప్రావిన్స్ ఫలితాలు రుజువుచేస్తున్నాయి. దేశపరిస్ధితులు కుాడా బాగాలేవు. ఈ నేపధ్యంలో ఇమ్రాన్ ఖాన్ పై వేటు వేయడానికి ఇదే సరైన సమయమన్నవాదన మిలటరీ లో వ్యక్తమవుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్