మంత్రులకే నిధులు లేవట…. ఎంత కష్టం.. ఎంత నష్టం
అదేంటి అనుకుంటున్నారా ? మంత్రులకు నిధుల కొరతేంటి ? అని పెదవి విరుస్తున్నారా ? అంటే ఔననే అంటున్నారు మంత్రుల పీఏలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. [more]
అదేంటి అనుకుంటున్నారా ? మంత్రులకు నిధుల కొరతేంటి ? అని పెదవి విరుస్తున్నారా ? అంటే ఔననే అంటున్నారు మంత్రుల పీఏలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. [more]
అదేంటి అనుకుంటున్నారా ? మంత్రులకు నిధుల కొరతేంటి ? అని పెదవి విరుస్తున్నారా ? అంటే ఔననే అంటున్నారు మంత్రుల పీఏలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు మంత్రులు నిధుల కొరతతో అల్లాడుతున్నారట. “మా సారుకు చాలా ఇబ్బందిగా ఉంది. పై ఖర్చులకు కూడా డబ్బులు లేవు. అడిగినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు“ అని పీఏలే మీడియాకు లీక్ చేయడం ఆసక్తిగా మారింది. జగన్ సర్కారులో మంత్రులకు డబ్బులకు ఇబ్బందేంటి ? అని చర్చించుకుంటున్నారు.
సంక్షేమ కార్యక్రమాలకు….
అంతేకాదు.. “ఈ పరిస్థితి మా సారుకే కాదు.. నలుగురి వరకు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. కొందరు పైకి చెబుతున్నారు. కొందరు సొంత డబ్బులు తెచ్చుకుని ఖర్చు చేసుకుంటున్నారు“ అని పీఏ ముక్తా యించాడు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెడుతున్న ఖర్చుతో ఖజానా నిండుకుంది. దీంతో అనేక ఖర్చులను తగ్గించుకోవాలని రెండు నెలల కిందటే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. అన్ని శాఖలకు నోట్ పంపారు. అయితే.. ఇది మామూలే కదా.. అనుకున్నారు మంత్రులు.కానీ, ఆదాయం తక్కువగా ఉండే.. శాఖలకు వెంటనే దీనిని అమలు చేశార మంత్రి బుగ్గన.
ఆదాయం తక్కువగా ఉండే….
హౌసింగ్, హోం, స్త్రీ సంక్షేమం, బీసీ సంక్షేమం, దేవదాయ ఇలా.. ఆరేడు శాఖలకు ఖర్చుల్లో 60 శాతం కోత పెట్టినట్టు తెలిసింది. దీంతో మంత్రులు తమ పర్యటలను కుదించుకున్నారు. అదే సమయంలో తరచుగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే మంత్రులు కూడా ఇప్పుడు తగ్గించేసుకున్నారు. ఏదైనా విషయం ఉంటే.. ప్రెస్ నోట్లు మాత్రమే విడుదల చేస్తున్నారు. మీడియా మిత్రులను పిలిస్తే కనీసంలో కనీసం స్నాక్స్ అయినా ఇవ్వాలి కదా.. దీనికైనా వేలల్లోనే బిల్లు వస్తోందని చెబుతున్నారు.
మంత్రి వర్గ సమావేశాల్లోనూ….
ఇక, మంత్రి వర్గ సమావేశాల్లోనూ ఫార్మాలిటీకి రెండు మాసాల కిందటే మంగళం పాడారు. మంత్రులకు కేవలం మంచినీళ్లు, కాఫీతోనే సరిపెడుతున్నారు. ఏదైనా తినాలన్నా.. కూల్ డ్రింక్, జ్యూస్ వంటివి తాగాలన్నా.. క్యాంటీన్ నుంచి ఇండివిడ్యువల్‌గా ఆర్డర్ ఇచ్చి తెప్పించు కోవాల్సిందేనని తెలుస్తోంది. మొత్తంగా మంత్రులకే నిధులు లేకుండా పోయాయా ? ఇంద ఆదానా ? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.