దేవుళ్ళ మీదనే ప్రమాణాలు ఏంటో దేవుడా ?
ఇది పక్కా రాజకీయం. కాదేదీ పాలిటిక్స్ కి అనర్హం అని ఏనాడో ముతక సామెత ఉంది. అలాగని మరీ పవిత్రమైన దేవుళ్ళను కూడా లాగేస్తారా అంటే అవసరం [more]
ఇది పక్కా రాజకీయం. కాదేదీ పాలిటిక్స్ కి అనర్హం అని ఏనాడో ముతక సామెత ఉంది. అలాగని మరీ పవిత్రమైన దేవుళ్ళను కూడా లాగేస్తారా అంటే అవసరం [more]
ఇది పక్కా రాజకీయం. కాదేదీ పాలిటిక్స్ కి అనర్హం అని ఏనాడో ముతక సామెత ఉంది. అలాగని మరీ పవిత్రమైన దేవుళ్ళను కూడా లాగేస్తారా అంటే అవసరం అయితే తప్పదు అనేస్తున్నారు రాజకీయ జీవులు. ఏపీలో ఇటీవల కాలంలో హాట్ టాపిక్ ఏంటి అంటే సత్య ప్రమాణాలు. ఇన్నాళ్ళు చిత్తూరు జిల్లాలోని కాణీపాకం వినాయకుడు ఈ సత్యప్రమాణాలకు సుప్రసిద్ధుడుగా ఉండేవారు. ఇపుడు ఏ వూర్కి ఆ వూరే, ఏ దేవుడికి ఆ దేవున్నే ముందు పెట్టి సత్య ప్రమాణాలు అంటున్నారు.
టేకిట్ ఈజీగా …..
సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ అంటూ నేతాశ్రీలు ఒక్క లెక్కన రెచ్చిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు నాయకులు ఇలా ప్రమాణాలు చేసి హైలెట్ అయ్యారు. ఆ తరువాత విశాఖకు సీన్ మారింది. తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు ఏకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ముగ్గులోకి దింపి సత్యప్రమాణానికి సవాల్ చేశారు. తనపైన ఆరోపణలను నిరూపించమని డిమాండ్ చేశారు. తీరా వైసీపీ తరఫున ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ వస్తే మాత్రం వెలగపూడి పత్తా లేకుండా పొయారు.
మరో సవాల్ రెడీ …..
ఇది కూడా వైసీపీ టీడీపీల మధ్యనే అసలైన చాలెంజ్. విశాఖ జిల్లాలోని పాయకరావుపేటలోని ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల సమరం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో ఫ్యామస్ ఉపమాక శ్రీ వెంకటేశ్వరుడు. దాంతో ఆయన సమక్షంలో సత్య ప్రమాణం చేస్తారా అంటూ పరస్పరం సవాళ్ళు చేసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. అవినీతి చేయలేదని అక్కడ ప్రమాణం చేయాలని అనిత సవాల్ చేస్తే, ముందు ఆమెనే ప్రమాణం చేయమంటున్నారు ఎమ్మెల్యే బాబూరావు. మొత్తానికి ఇదిపుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతోంది.
మరీ అంత భక్తా…?
ఈ సవాళ్ళను చూసి జనం విస్తుపోతున్నారు. ఇంతకాలం రాజకీయ నాయకులు తమలో తాము తిట్టుకుంటూ ఎన్ని అయినా సవాళ్ళు చేసుకున్నా ఫరవాలేకపోయింది. ఇపుడు అందరికీ గట్టి నమ్మిక ఉన్న దేవుడి మీద ప్రమాణాలు ఏంటి అంటూ ఆస్తిక జనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి అన్న దాన్ని కూడా క్యాష్ చేసుకుంటూ పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్న ఈ తరహా జిమ్మిక్స్ పైన హిందూ మతాధిపతులు కూడా మండిపడుతున్నారు. జనమే ఓట్లేసి గెలిపించారు కాబట్టి వారిలోనే ఏమైనా తేల్చుకోవాలని, అంతే తప్ప దేవుళ్ళను సీన్ లోకి తేవడమేంటని ఫైర్ అవుతున్నారు. అయినా రాజకీయ జీవులు దీన్ని ఆపుతారా అన్నదే డౌట్.