రజని రఫ్ ఆడించారుగా?
మద్య నిషేధం దిశగా ఏపీ లో జగన్ సర్కార్ వచ్చిన నాటినుంచి అడుగులు వేస్తుంది. తన ఎన్నికల ప్రచారంలో దశలవారీ మద్య నిషేధం విధించి మహిళల కన్నీరు [more]
మద్య నిషేధం దిశగా ఏపీ లో జగన్ సర్కార్ వచ్చిన నాటినుంచి అడుగులు వేస్తుంది. తన ఎన్నికల ప్రచారంలో దశలవారీ మద్య నిషేధం విధించి మహిళల కన్నీరు [more]
మద్య నిషేధం దిశగా ఏపీ లో జగన్ సర్కార్ వచ్చిన నాటినుంచి అడుగులు వేస్తుంది. తన ఎన్నికల ప్రచారంలో దశలవారీ మద్య నిషేధం విధించి మహిళల కన్నీరు తుడిచేస్తా అంటూ హామీ ఇచ్చారు వైసిపి అధినేత వైఎఎస్ జగన్. అన్నట్లుగానే ప్రభుత్వంలో కొలువైన వెంటనే మద్యం ధరలను అమాంతం పెంచేశారు. బ్రాందీ షాప్ లను ప్రయివేట్ నుంచి ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేశారు. ఏడాదికోసారి మద్యపాన విధానం సమీక్షిస్తూ మందు తాగాలంటే హడలిపోయేలా చేయడమే అన్న సూత్రాన్ని జగన్ ఫాలో అవుతున్నారు. దీనిపై మద్యం ప్రియులు ఎంత గగ్గోలు పెట్టినా సిఎం పట్టించుకోవడం లేదు.
పెరిగిన బ్లాక్ మార్కెట్ …
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లాక్ డౌన్ మద్యపాన ప్రియులకు రోజు గడవడమే భారంగా మార్చేసింది. బ్రాందీ షాప్ లు, బార్లు మూసి వేయడంతో ముందే ఈ పరిణామాలు ఉహించి స్టాక్ పెట్టుకుని బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు కొందరు. ఇది ఏపీ లో చాలా రహస్యంగా నడుస్తున్న బహిరంగ సత్యం. ఈ వ్యవహారం సర్కార్ కి ఫిర్యాదుల రూపంలో పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఏపీ లో కేసులు నమోదు అవుతున్నాయి. పలు చోట్ల మద్యం షాపుల్లో చోరీలు సైతం మొదలు అయిపోయాయి. కొందరు ఎక్సయిజ్ సిబ్బందే మద్యం చోరీలకు దిగడం సంచలనమే అయ్యింది. దీనిపై సర్కార్ సీరియస్ గా ఉంది. బార్ల యజమానులు కొందరు మద్యం బ్లాక్ లో విక్రయిస్తున్నారని గుర్తించి చర్యలకు ఆదేశించింది.
డబ్బులు డిమాండ్ చేసి అడ్డంగా బుక్ …
ఇవన్నీ ఎలా ఉన్నా తాజాగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎక్సయిజ్ హెడ్ కానిస్టేబుల్ చేసిన దందా ఆడియో రూపంలో ఎమ్యెల్యే విడదల రజని చేతికి చిక్కింది. దాంతో ఎమ్యెల్యే నేరుగా ఎక్సయిజ్ స్టేషన్ కి వెళ్లి సదరు కానిస్టేబుల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆశించింది ఏమిటి మీరు చేస్తుంది ఏమిటి అంటూ రఫ్ ఆడించారు. ఆడియో లో మద్యం బ్లాక్ లో విక్రయించేవారినుంచి కానిస్టేబుల్ తనకు ఇవ్వలిసిన డబ్బులు డిమాండ్ చేసినట్లు అంతకుముందు కొన్ని లావాదేవీల్లో తనకు రావలిసిన డబ్బు కోసం నేరుగా డిమాండ్ చేయడం ఉంది. తాజా వివాదంలో హెడ్ కానిస్టేబుల్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రజని ఆదేశించారు. ఈ వ్యవహారం ఏపీ లో హాట్ టాపిక్ అయింది.