సింపతీని సింపతీతోనే కొట్టాలనుకుంటున్నారా?
దుబ్బాక ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్దమయి పోయాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తమ అభ్యర్థిగా ఇటీవల మరణించిన సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు కేటాయిస్తూ [more]
దుబ్బాక ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్దమయి పోయాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తమ అభ్యర్థిగా ఇటీవల మరణించిన సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు కేటాయిస్తూ [more]
దుబ్బాక ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్దమయి పోయాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తమ అభ్యర్థిగా ఇటీవల మరణించిన సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అనేక ఆలోచనల తర్వాత కేసీఆర్ సుజాత పేరును ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి తననే అట్టిపెట్టుకున్న సోలిపేట కుటుంబానికే టిక్కెట్ ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ మరో ఎత్తుకు దిగింది.
చెరకు కు ఇవ్వాలని…..
దుబ్బాక నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన చెరకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకే దుబ్బాక టిక్కెట్ ను ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. చెరుకు ముత్యంరెడ్డి సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరారు.
ముత్యంరెడ్డి మరణంతో…
దుబ్బాకలో చెరుకు కుటుంబానికి మంచి పట్టుంది. చెరకు ముత్యం రెడ్డి మరణించడంతో ఆయనపై ఉన్న సానుభూతి కూడా పనిచేస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. 2009 ముందు వరకూ దొమ్మాటకు చెరకు ముత్యం రెడ్డి ప్రాతినిధ్యం వహించే వారు. 2009 లో జరిగిన పునర్విభజనలో దొమ్మాట దుబ్బాక నియోజకవర్గంగా మారింది. 2009 ఎన్నికల్లో దుబ్బాక నుంచి ముత్యంరెడ్డి గెలిచారు. తండ్రి ముత్యంరెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో చురుగ్గా ఉన్నారు.
చేరితే టిక్కెట్ గ్యారంటీ….
శ్రీనివాసరెడ్డికి ఏదైనా నామినేట్ పదవి ఇవ్వాలని కేసీఆర్ భావించారు. కానీ దుబ్బాక నియోజకవర్గం టిక్కెట్ కావాలని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టారు. చివరకు సానుభూతి పనిచేస్తుందని రామలింగారెడ్డి భార్య సుజాతకు కేసీఆర్ టిక్కెట్ కన్ఫర్మ్ చేయడంతో శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయంటున్నారు. సానుభూతి ఓట్లను పొందవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. మొత్తం మీద దుబ్బాక నియోజకవర్గంలో సానుభూతి ని సానుభూతితోనే ఎదుర్కొనాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. శ్రీనివాసరెడ్డి ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ లో చేరనున్నారు.