అందుకే అలా నిర్ణయించారా?
కర్ణాటక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఇప్పటి వరకూ కాంగ్రెస్ కు అండగా నిలుస్తూ వస్తుంది. ఆ సామాజికవర్గం ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ [more]
కర్ణాటక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఇప్పటి వరకూ కాంగ్రెస్ కు అండగా నిలుస్తూ వస్తుంది. ఆ సామాజికవర్గం ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ [more]
కర్ణాటక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఇప్పటి వరకూ కాంగ్రెస్ కు అండగా నిలుస్తూ వస్తుంది. ఆ సామాజికవర్గం ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అనేక స్థానాల్లో గెలుస్తూ వస్తుంది. అయితే కొంతకాలం క్రితం జరిగిన సంఘటనతో ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ దూరమయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అందుకే జనతాదళ్ ఎస్ కూడా కాంగ్రెస్ కు దూరం జరగడానికి కారణాల్లో ఇది ఒకటి అని రాజకీయ విశ్లేషకులు సయితం చెబుతున్నారు.
ఆ సంఘటన తో…..
కర్ణాటకలో కొంతకాలం క్రితం జరిగిన సంఘటన దేశాన్ని కుదిపేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు తో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పురిగొల్పింది. దీంతో ఒక వర్గం వారిపై అధికార బీజేపీ పార్టీ కేసులు నమోదు చేసింది. ధ్వంసం అయిన ప్రభుత్వ ఆస్తులుకూడా వారి నుంచే రికవరీ చేయాలని నిర్ణయించింది. అయితే దీనికి కారణం కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు కావడంతో కాంగ్రెస్ ఆ సామాజిక వర్గం నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటోంది.
ఒక సామాజికవర్గాన్ని…..
అందుకే జేడీఎస్ బెంగళూరులో జరుగుతున్న రాజరాజేశ్వరి నగర నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతివ్వకూడదని నిర్ణయించుకుంది. తమ అభ్యర్థిని ప్రకటించింది. బెంగళూరులో జరిగిన సంఘటన అయినా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. బీజేపీకి ఎటూ ఆ వర్గం దగ్గరవ్వదు. అందుకే కుమారస్వామి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిని ప్రారంభించారని, ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే భాగంలో ప్రయత్నమే ఇది అని చెబుతున్నారు.
భవిష్యత్ లోనూ…..
అందుకే కుమారస్వామి కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. రాజారాజేశ్వరి నగరలో జేడీఎస్, కాంగ్రెస్ కలసి పోటీ చేసి ఉంటే విజయం సులువయి ఉండేది. కానీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కుమారస్వామి ఈ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థులను బరిలోకి దించారంటున్నారు. దేవెగౌడ సూచనల మేరకు కాంగ్రెస్ ను దూరంపెట్టడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల వైరం వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగేలా కన్పిస్తుంది.