జేసీ సోదరులు గప్ చిప్… ?
రాయలసీమలో పెద్ద నాయకులు, పెద్ద గొంతు కలిగిన నేతలుగా జేసీ సోదరులు ఉన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నా కూడా వారి బలం వారికి ఉంటుంది. రాజకీయ [more]
రాయలసీమలో పెద్ద నాయకులు, పెద్ద గొంతు కలిగిన నేతలుగా జేసీ సోదరులు ఉన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నా కూడా వారి బలం వారికి ఉంటుంది. రాజకీయ [more]
రాయలసీమలో పెద్ద నాయకులు, పెద్ద గొంతు కలిగిన నేతలుగా జేసీ సోదరులు ఉన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నా కూడా వారి బలం వారికి ఉంటుంది. రాజకీయ గుర్తింపు కూడా వారికి అలాగే దక్కుతుంది. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన జేసీ సోదరులు 2014 నుంచి 2019 వరకూ ఎంత హడావుడి చేయాలో అంతా చేశారు. జగన్ మీద వారు ఆడిపోసుకోని రోజు అంటూ లేదు. నాడు చంద్రబాబు పెదవుల మీద చిరునవ్వు కోసం జేసీ బ్రదర్స్ ఏకంగా బహిరంగ సభలలోనే జగన్ మీద తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు.
రివర్స్ అయిందిగా..?
అలా వారు నాడు నోరు పారేసుకోవడం వల్ల టీడీపీకి ఏం లాభం కలగలేదు, పైగా జేసీ బ్రదర్స్ కే భారీ నష్టం దాపురించింది. సొంత కులంలోనే వారు చెడ్డ అయిపోయారు. ఆ ఫలితాన్ని 2019 ఎన్నికల్లో చవిచూశారు. ఆ తరువాత కూడా చాన్స్ వస్తే చాలు జగన్ మీద మాటల తూటాలను ప్రయోగించేవారు. అయితే ఇంతలా దూకుడు మీద ఉండే జేసీ బ్రదర్స్ ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అన్నది చర్చగా ఉంది. చంద్రబాబుని పొగుడుతూ జగన్ని తెగనాడే జేసీ దివాకరరెడ్డి ఈ మధ్య అసలు మీడియాకు చిక్కకుండా నల్లపూసగా మారిపోయారు.
తెరవెనక బంధమా..?
అయితే దీనికి కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ విషయంలో దూకుడుగా వెళ్ళి 2019 ఎన్నికల్లో ఫలితాన్ని చూసిన జేసీ బ్రదర్స్ కు 2021లో కొంత అవగాహన వచ్చింది అంటున్నారు. ముఖ్యంగా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ పదవి విషయంలో జేసీ ప్రభాకరరెడ్డికి చాన్స్ ఇస్తూ వైసీపీ వ్యవహరించిన తీరుతోనే జేసీలు మెత్తబడ్డారని టాక్. నాడు కనుక తలచుకుంటే ఆ చైర్మన్ పీఠం కచ్చితంగా వైసీపీక దక్కేది. జగన్ జోక్యం చేసుకుని ఫిరాయింపులు వద్దు అని చెప్పారని అంటారు. జేసీ ప్రభాకరరెడ్డి ఇదే విషయాన్ని మీడియా ముఖంగా చెప్పి జగన్ దయతోనే తాను చైర్మన్ అయ్యానని అన్నారు.
అనూహ్య పరిణామాలు…
అనంతపురం జిల్లాలో ఎంత కాదనుకున్నా జేసీ బ్రదర్స్ రాజకీయ ప్రాబల్యం కాదనలేనిది. ఇక 2024 నాటికి తమకు రాజకీయాలు వద్దు అనుకుంటున్న ఈ బ్రదర్స్ వారసుల కోసం కొంత తగ్గుతున్నారు అంటున్నారు. టీడీపీకి సీమలో పెద్దగా సీన్ లేకపోవడం, టీడీపీలో తమకు విలువ లేకపోవడంతో మూడేళ్ల పాటు కామ్ గా ఉండి వచ్చే ఎన్నికల నాటికి అనూహ్య నిర్ణయమే తీసుకుంటారు అంటున్నారు. తాము సైలెంట్ గా ఉండి వారసులను వైసీపీలోకి పంపినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మరో వైపు జగన్ కి కూడా ఈ జిల్లా అతి ముఖ్యం. జేసీ బ్రదర్స్ సహకరిస్తామంటే ఓకే చెప్పేందుకు రెడీ అంటున్నారు. ఇన్నాళ్ళూ ఆభిజాత్యాల కారణంగానే ఒకరిని ఒకరు అర్ధం చేసుకోలేదని, ఇపుడు కొంత అవగాహన కుదిరిందని అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జిల్లాలో సంచలన రాజకీయాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు.