మళ్లీ మొదలు పెట్టారు…గుడుంబా శంకర్ లు చెలరేగి పోతున్నారు
మద్యం ఉభయ రాష్ట్రాల్లో కనుమరుగై నేలపైనే అయ్యింది. చుక్క దొరక్క మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి వారికి. ఇదే సమయం నాలుగు రూపాయలు సంపాదించేందుకు అనుకుని కొందరు ఎక్సైజ్ [more]
మద్యం ఉభయ రాష్ట్రాల్లో కనుమరుగై నేలపైనే అయ్యింది. చుక్క దొరక్క మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి వారికి. ఇదే సమయం నాలుగు రూపాయలు సంపాదించేందుకు అనుకుని కొందరు ఎక్సైజ్ [more]
మద్యం ఉభయ రాష్ట్రాల్లో కనుమరుగై నేలపైనే అయ్యింది. చుక్క దొరక్క మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి వారికి. ఇదే సమయం నాలుగు రూపాయలు సంపాదించేందుకు అనుకుని కొందరు ఎక్సైజ్ సిబ్బందే చేతివాటం ప్రదర్శిస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు. అయితే బార్ల యజమానులు కొందరు పరిస్థితిని ముందే గ్రహించి కొంత స్టాక్ సైడ్ చేసి మూడు నాలుగు రెట్ల అధిక ధరలకు విక్రయించేస్తున్నారు. ఇంత ధర పెట్టి కొనలేని మందుబాబులు కల్లు వైపు నడక ప్రారంభించారు. మరికొందరు శానిటైజర్లు తాగి ఆసుపత్రి పాలై పోయారు. తెలంగాణ లో అయితే వందలమంది ఎర్రగడ్డలో చేరిపోయారు. ఇప్పుడు గతంలో కొందరు వ్యాపారులు దాచిన స్టాక్ సైతం అయిపోవచ్చింది. దాంతో మద్యం కోసం ప్రత్యామ్నాయం అన్వేషించడం మొదలు పెట్టారు.
గ్రామాల్లో సారా ….
మారుమూల గ్రామాల్లో ఉండే తోటల్లో సారాను మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో అక్రమంగా తయారు చేసి సిటీస్ లో విక్రయించేస్తున్నారు కొందరు. స్పిరిట్ అధికంగా ఉండే సారా కారణంగా చావు డప్పు కొట్టేస్తుంది ఇది సేవిస్తున్నవారికి. కరోనా కట్టడి పేరుతో ఒక పక్క పోలీసులు జనసమ్మర్థ ప్రాంతాలవైపే కన్నేశారు. ఇక ఎక్సయిజ్ శాఖకు అవినీతి గబ్బు పట్టడంతో సారా మేకర్స్ పని ఎంతో సులువు అయ్యిందన్నది స్పష్టం అయిపోతుంది.
మాఫియాతో తలనొప్పి…
దీంతో విచ్చలవిడిగా సారా తయారీ, విక్రయాలు సాగిపోతున్నాయి. అది ఏ స్థాయిలో అంటే సాక్షాత్తూ ఏపీ స్పీకర్ ఇదెక్కడి సారా రా బాబు అనే పరిస్థితికి సీన్ మారిపోయింది. మద్యపానానికి పూర్తి వ్యతిరేకంగా నడిచే జగన్ సర్కార్ కి గుడుంబా వెనుక వుండే మాఫియా నుంచి తలపోట్లు తప్పకపోవచ్చు. గతంలో సారా విక్రయాలను అడ్డుకోవడానికి లిక్కర్ షాప్ ల సిండికేట్స్ తీవ్రంగా కృషి చేశాయి. వారి కృషి ఫలితం గా సారా చరిత్ర సమాప్తం అనుకుంటే కరోనా రూపంలో ఆ రక్కసి తిరిగి కరాళనృత్యం మొదలు పెట్టింది. దీన్ని జగన్ సర్కార్ ఏ మేరకు అడ్డుకోగలదో చూడాలి.