ఈసారి ఈ నియోజకవర్గాల్లో కష్టమేనా?
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అండగా నిలిచారు. అందుకే 151 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. 151 నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి [more]
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అండగా నిలిచారు. అందుకే 151 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. 151 నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి [more]
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అండగా నిలిచారు. అందుకే 151 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. 151 నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు. రాష్ట్రలోని అన్ని ఎస్.సి, ఎస్టీ నియోజకవర్గాల్లో దాదాపు వైసీపీ విజయం సాధించింది. ఒక్క కొండపి, రాజోలు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది.
తొలి నుంచి అండగా…
వైసీపీకి తొలి నుంచి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు అండగా నిలుస్తూ వస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో ఈ ఫలితం రిపీట్ అవుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి. తమకు అండగా నిలిచిన ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనే ఈ సమస్య ఉంది. వీటిని పరిష్కరించడానికి పార్టీ నేతలు ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటుందంటున్నారు.
ఇరవై నియోజకవర్గాల్లో….
35 నియోజకవర్గాల్లో దాదాపు ఇరవై నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది. అనేక చోట్ల అగ్రకుల నేతల ఆధిపత్యంతో ఇక్కడ విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకులాలకు చెందిన వారిని నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా నియమించడమే సమస్యకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. దీంతో ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు. రాజోలు, రంపచోడవరం, చింతలపూడి, రాజాం, తాడికొండ నియోజకవర్గాల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి.
దృష్టి పెట్టకుంటే…?
ఇక నందికొట్కూరు, కోడుమూరు, శింగనమల వంటి నియోజకవర్గాల్లో విభేదాలు వీధికెక్కాయి. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం అంత సులువు కాదు. ఓటమి పాలయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికైనా తనకు 2019 ఎన్నికల్లో అండగా నిలిచిన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను విస్మరించకుండా, అక్కడ సమస్యలను పరిష్కరించుకోగలిగితే కొంత ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ వీటిపై దృష్టి పెట్టాలని ఆ పార్టీ నేతలే కోరుతున్నారు.