టీడీపీ జీరో జిల్లాల్లో సీన్ రివర్స్ అవుతోందా ?
గత 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చాలా జిల్లాల్లో అసలు ఖాతాలే తెరవని పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు కూడా అంతో ఇంతో బలంగా ఉన్నామని.. [more]
గత 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చాలా జిల్లాల్లో అసలు ఖాతాలే తెరవని పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు కూడా అంతో ఇంతో బలంగా ఉన్నామని.. [more]
గత 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చాలా జిల్లాల్లో అసలు ఖాతాలే తెరవని పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు కూడా అంతో ఇంతో బలంగా ఉన్నామని.. కీలకమైన నాయకులు ఉన్నారని చెప్పుకొంటూ.. వచ్చిన టీడీపీకి.. పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో టీడీపీ పరిస్థితి జీరో అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాలు ఉంటే.. నెల్లూరు, కడప, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో పార్టీ గత ఎన్నికల్లో బోణీ కొట్టలేక పోయింది. ఈ నాలుగు జిల్లాలను వైసీపీ పూర్తిగా తన ఖాతాలో వేసుకుంది.
రెండేళ్లవుతున్నా….?
దీంతో ఇప్పటికైనా .. ఈ జిల్లాల్లో టీడీపీ పుంజుకుందా ? లేదా ? అనే చర్చ తెరమీదికి వస్తోంది. ఎన్నికలు ముగిసి. రెండేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో ఈ జీరో జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది ? అన్నది చూస్తే వైసీపీకి ఇప్పుడు నాటి సీన్ లేదని తెలుస్తోంది. ఈ నాలుగు జిల్లాల్లో నెల్లూరులో పార్టీకి మంచి ఎడ్జ్ ఉన్నప్పటికీ.. నేతల మధ్య కలివిడి తనం లేకపోవడం.. ఇప్పటికీ పార్టీ పుంజుకునే పరిస్థితి లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. ఒక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్ప ఎవరూ ముందుకు రావడం లేదు.
అధికార పార్టీలో కుమ్ములాటలు….
వాస్తవానికి నెల్లూరులో.. అధికార పార్టీ వైసీపీ లో కుమ్ములాటలు పెరిగిపోయాయి. ఆధిపత్య ధోరణి పెరిగింది. ఈ క్రమంలో అభివృద్ధికి ప్రాధాన్యం లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. దీంతో దీనిని తమకు అవకాశంగా మలుచుకుని టీడీపీ ఎదిగేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నప్పటికీ.. అలా చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక, కడప విషయానికి వస్తే.. ఇది పూర్తిగా వైఎస్ కుటుంబానికి కంచుకోట. అయినప్పటికీ.. ఒకటి రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి గట్టి పట్టుంది. అయితే.. కీలకమైన నాయకులు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వంటి వారు.. గత ఎన్నికల తర్వాత పార్టీ మారిపోయారు. దీంతో పార్టీకి ఇబ్బందికర పరిణామాలు అలానే కొనసాగుతున్నాయి.
నాలుగు నియోజకవర్గాల్లో….
అయితే వైసీపీ నేతల తీరు కారణంగా ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, కమలాపురం లాంటి చోట్ల వైసీపీ గ్రాఫ్ బాగా డౌన్ అవుతోంది. అయితే దీనిని క్యాష్ చేసుకునే సమర్థ నేతలే టీడీపీలో లేరు. మరోవైపు కర్నూలులో కోలుకునే పరిస్థితి పుష్కలంగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా వైసీపీ నేతల మధ్య సమన్వయ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో ఈ గ్యాప్‌ను టీడీపీ వినియోగించుకుంటే.. బెటర్ అంటున్నారు పరిశీలకులు. ఇక, విజయనగరం విషయానికి వస్తే.. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై జగన్ చేసిన దూకుడు .. టీడీపీకి ప్లస్ అయింది.
పరిస్థితి మెరుగువుతున్నా….
రాజును వైసీపీ ఎంపీ సాయిరెడ్డి టార్గెట్ చేయడం, మాన్సస్ ట్రస్ట్ వ్యవహారాల నుంచి అశోక్‌ను తప్పించడం వంటివి వైసీపీకి మైనస్ అయ్యారు. అదే సమయంలో రామతీర్థంలో రాముడి విగ్రహానికి జరిగిన అవమానం వంటివి కూడా వైసీపీ సర్కారుకు బ్యాడ్ నేమ్ తీసుకురాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో జిల్లా పార్టీలో బూమ్ వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా చూస్తే.. విజయనగరంలో పరిస్థితి మెరుగవుతున్నా.. ఇటీవల కాలంలో నేతలు జారి పోతుండడం మరోవైపు కలవరానికి గురి చేస్తోంది.