కామెడీ అయినా సీరియస్ గానే…?
నిజమే.. కామెడీ యాక్టర్ అయినా… సీరియస్ గానే నిజం చెప్పారు 30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ పృధ్వీ. ప్రజలు సినిమా వాళ్లకు ఓట్లేయవద్దని ఆయన కుండబద్దలు కొట్టేశారు. సినిమాల్లో [more]
నిజమే.. కామెడీ యాక్టర్ అయినా… సీరియస్ గానే నిజం చెప్పారు 30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ పృధ్వీ. ప్రజలు సినిమా వాళ్లకు ఓట్లేయవద్దని ఆయన కుండబద్దలు కొట్టేశారు. సినిమాల్లో [more]
నిజమే.. కామెడీ యాక్టర్ అయినా… సీరియస్ గానే నిజం చెప్పారు 30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ పృధ్వీ. ప్రజలు సినిమా వాళ్లకు ఓట్లేయవద్దని ఆయన కుండబద్దలు కొట్టేశారు. సినిమాల్లో విషయం అయిపోగానే ఎక్కువ మంది పాలిటిక్స్ లోకి రావడం షరా మామూలయింది. స్క్రీన్ మీద చూసిన వారిని నిత్య జీవితంలో దగ్గరుండి చూస్తామని, వెండితెర మీద లాగానే తమ సమస్యలు కూడా పరిష్కరిస్తారని ప్రజలు సినిమా వాళ్లకు ఓట్లేసి చట్టసభలకు పంపుతున్నారు. కానీ గత కొంతకాలంగా సినిమావాళ్ల చరిత్ర తిరగబడుతోంది.
ఎన్టీఆర్ ను నమ్మి…..
ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేని పరిస్థితి వాళ్లది. గతంలో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ప్రజలు ఆయన్ను నమ్మారు. నమ్మి అధికారాన్ని అప్పగించారు. ఎన్టీఆర్ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అంతకు ముందు జగ్గయ్య, కృష్ణ వంటి సినీనటులు చట్ట సభలకు ఎంపికైనా అది కేవలం క్రేజ్ మాత్రమే కాదు. అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి గెలిచారని చెప్పకతప్పదు.
వరసగా తిరస్కరిస్తూ….
ఎన్టీరామారావు రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయితే ఎన్టీఆర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్లకు ప్రజల నుంచి తిరస్కారం ఎదురవుతుంది. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల నుంచి ఓడిపోవడానికి ప్రధాన కారణాలు వేరే చెప్పనక్కర లేదు. పవన్ తమకు అందుబాటులో ఉండరని, గెలిపించినా ప్రయోజనం లేదని పవన్ ను దూరం పెట్టేశారు.
పట్టించుకోకుండా…..
ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినిమా వాళ్లకు కాలం చెల్లిందనే చెప్పాలి. ఒకప్పుడు టాలివుడ్ మద్దతు కోసం అన్ని పార్టీలూ ఎదురు చూసేవి. టాలీవుడ్ కూడా రెండు వర్గాలుగా చీలిపోవడం, వారి ప్రభావం ప్రజలపై ఎంత మాత్రం పడవకపోవడంతో ఇక పార్టీలు కూడా సినిమా వాళ్లను దూరం పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు సినీనటుడు ఆలీకి ఏ పార్టీకి టిక్కెట్ ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇక రాజకీయాల్లోకి వచ్చే సినిమా వాళ్లను పార్టీలతో పాటు ప్రజలూ పట్టించుకోరన్న ది స్పష్టంగా తెలుస్తోంది.