ప్రతీకారం తీర్చుకుంటారా….?
జమ్మూ కాశ్మీర్ పుల్వారా లో జరిగిన ఆత్మాహుతి దాడి దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఈ దాడిలో 44 మంది జవాన్ల మృతి చెందడం అనేకమంది [more]
జమ్మూ కాశ్మీర్ పుల్వారా లో జరిగిన ఆత్మాహుతి దాడి దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఈ దాడిలో 44 మంది జవాన్ల మృతి చెందడం అనేకమంది [more]
జమ్మూ కాశ్మీర్ పుల్వారా లో జరిగిన ఆత్మాహుతి దాడి దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఈ దాడిలో 44 మంది జవాన్ల మృతి చెందడం అనేకమంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దీనికి ప్రతీకారం తప్పనిసరిగా ఉంటుందన్న హోం మంత్రి రాజ్ నాధ్ వ్యాఖ్యలు సైనికుల మనోస్థర్యాన్ని పెంచేదే. అయితే ఆయన వ్యాఖ్యల్లో పాక్ పై మరోసారి దాడులు తప్పవన్న ధ్వనులు ధ్వనిస్తున్నాయి. దాంతో దేశంలోని పాక్ సరిహద్దు ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఏక్షణంలో ఏమి జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది.
మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ …?
మోడీ సర్కార్ వచ్చాక సర్జికల్ స్ట్రైక్స్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు కావడంతో పాక్ తో తీవ్రస్థాయిలో పోరాడుతున్నామనే భావన అధికారంలో వున్న మోడీ సర్కార్ కి ఒక రకంగా లబ్ది చేకూర్చేది. గతంలో కార్గిల్ వార్ లో విజయం తరువాత వాజపేయి తిరిగి అధికారం సాధించారు. ఇదే సూత్రం మోడీ కూడా అమలు చేస్తారనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సరైన జవాబు చెప్పాలని….
ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దేశభక్తి అంశానికి ఇలాంటి సమయాల్లో భారతీయులు ప్రధానంగా ప్రధమ ప్రాధాన్యత ఇస్తారని గత చరిత్ర స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సంఘటనల నేపథ్యంలో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో చెప్పడం కష్టమే. మరోపక్క ముష్కరుల దారుణ దాష్టికాన్నీ దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. ఉగ్రవాదులకు సరైన జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. మోదీ ఈ దాడి పట్ల ఫైరయ్యారు. పాక్ కు తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. మరి మోడీ సర్కార్ ఎలాంటి జవాబు చెబుతుందో వేచి చూడాలి.